Kiara advani Diet Plan: కియారా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా.? ఎంత సింపుల్ డైట్ ప్లాన్ అంటే..
సినీ తారలు ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. వయసు తాలుకూ చాయలు కనిపించకుండా నిత్యం యవ్వనంగా కనిపించడానికి ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి. తీసుకునే ఆహారం నుంచి వర్కవుట్స్ వరకు ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌లు..
సినీ తారలు ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. వయసు తాలుకూ చాయలు కనిపించకుండా నిత్యం యవ్వనంగా కనిపించడానికి ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి. తీసుకునే ఆహారం నుంచి వర్కవుట్స్ వరకు ప్రతీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌లు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. బరువు పెరగకుండా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటారు. అడపాదడపా సినీ తారలు తమ ఫిట్‌నెస్ సీక్రెట్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సైతం తన ఫిట్‌నెస్ సీక్రెట్‌కు సంబంధించిన కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ హెల్త్ సీక్రెట్ ఏంటో మనమూ తెలుసుకుందామా.?
కియారా బ్యూటీ సీక్రెట్‌లో జిమ్‌ది మొదటి స్థానమని చెప్పొచ్చు. నిత్యం జిమ్‌లో గడిపే కియారా పుష్‌అప్స్ చేయడానికి ఇష్టపడతారు. తన ఫిట్‌నెస్‌కు వర్కవుట్ చేయడమే ప్రధాన కారణమని కియారా పలుసార్లు మీడియాతో పంచుకున్నారు. ఇక జిమ్‌కు వెళ్లలేని పరిస్థితుల్లో కియారా ఇంట్లో బాక్సింగ్, డ్యాన్స్ వంటివి చేస్తుంటానని తెలిపారు. వర్కవుట్‌లను ఆస్వాదించినప్పుడు బరువు తగ్గడం, మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవడం సులభం అవుతుందని కియారా తెలిపారు.
ఇక కియారా డైట్ ప్లాన్ విషయానికొస్తే ఈ బ్యూటీ ఆరోగ్యకరమైన ఆహారానికే పెద్ద పీట వేస్తుంది. కియారా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటానని తెలిపారు. ఇది జీవక్రియ మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అనంతరం అల్పాహారంలో ఓట్స్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, యాపిల్ వంటి తాజా పండ్లను తీసుకుంటారు. ఇక మధ్యాహ్న భోజనం విషయంలో ఇంట్లో చేసిన ఆహారానికి కియారా ప్రాయారిటీ ఇస్తారు. తక్కువ నూనె, ఉప్పుతో కూడిన ఆహారాన్ని తీసుకుంటారు. రోటీ, వెజ్ కర్రీస్‌ను లంచ్‌గా తీసుకుంటారు. అలాగే డిన్నర్ విషయానికొస్తే రాత్రి కూడా కియారా లైట్ ఫుడ్‌నే తీసుకుంటారు. ఎక్కువగా చేపలు తినడానికి ప్రాధాన్యత ఇస్తానని కియారా పలు సందర్భాల్లో తెలిపారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..