Egg: గుడ్డులో పచ్చ సొన తినడం ఆరోగ్యానికి మంచిదేనా.? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..
పోషకాలకు కేరాఫ్ అడ్రస్ గుడ్డు. ప్రతీ రోజూ ఒక గుడ్డు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతుంటారు. NCBI నివేదిక ప్రకారం, గుడ్డులోని ప్రోటీన్ పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. అయితే గుడ్డు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కొన్ని రకాల అనుమానాలు..
పోషకాలకు కేరాఫ్ అడ్రస్ గుడ్డు. ప్రతీ రోజూ ఒక గుడ్డు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతుంటారు. NCBI నివేదిక ప్రకారం, గుడ్డులోని ప్రోటీన్ పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది. అయితే గుడ్డు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కొన్ని రకాల అనుమానాలు నిత్యం వేధిస్తూనే ఉంటాయి. పడగడుపున గుడ్డును తినొచ్చా, గుడ్డును అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఉంటాయా.? లాంటి ప్రశ్నలు వస్తుంటాయి. అంతేకాకుండా గుడ్డులోని పచ్చ సొన తినడం వల్ల ఆరోగ్యానికి హానికరమే వాదనలు వినిపిస్తుంటాయి. ఇంతకీ గుడ్డులోని పచ్చ సొని ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది.? దీనివల్ల ఏమైనా చెడు ప్రభావాలు ఉంటాయా.? లాంటి అంశాలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ ప్రియాంక షెరావత్ గుడ్డుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ఇందులో భాగంగానే ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుడ్డులో పచ్చసొన, పైన ఉండే తెల్లటి భాగం చూడడానికి వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటి లక్షణాలు దాదాపు సమానంగా ఉన్నాయని తెలిపారు. కోడిగుడ్డులో తెల్లటి భాగం ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో పచ్చ సొన కూడా ఆరోగ్యమేనన్నారు. పచ్చసొనలో ఏ, ఈ, కే విటమిన్లు, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయని తెలిపారు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.
View this post on Instagram
గుడ్డులోని పచ్చసొని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్ వివరించారు. పచ్చసొనలో ఉండే సెలీనియం థైరాయిడ్ను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఒక గుడ్డులో 55 కేలరీలు, 2.5 గ్రాముల ప్రోటీన్, 4.5 గ్రాముల కొవ్వు, 0.61 కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పచ్చసొనను ఆఫ్ బాయిల్డ్ చేసుకొని నినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే జిమ్, వ్యాయామం చేసే వారు పచ్చ సొనను పాలలో కలిపి తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..