బెల్లం ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా.. 

02 January 2025

Pic credit-Getty

TV9 Telugu

బెల్లం స్వభావం వేడిగా ఉంటుంది. దీనిని శీతాకాలంలో తింటారు. ఇది ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

 చలికాలంలో బెల్లం

బెల్లం కూడా సహజమైన స్వీటెనర్. ఇది చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది. అయితే బెల్లాన్ని అతిగా తినడం హాని కలిగిస్తుంది

సహజ స్వీటెనర్

పోషకాహార నిపుణుడు నమామి అగర్వాల్ మాట్లాడుతూ కొన్ని అనారోగ్య పరిస్థితులలో బెల్లం తినకూడదు. ఎవరు బెల్లం తినొద్దో తెలుసుకుందాం.. 

నిపుణుల అభిప్రాయం

కొన్నిసార్లు బెల్లం ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం, తలనొప్పి , వాంతులు వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 

కడుపు సమస్యలు

పంచదార కంటే బెల్లం శ్రేష్ఠమైనది. అయితే బెల్లం కూడా అధికంగా ఉన్న తీపి పదార్ధం. అందువల్ల దీన్ని ఎక్కువగా తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

రక్తంలో చక్కెర

ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లయితే  బెల్లం తినకూడదు. ఏదైనా మంట సమస్య ఉన్నవారు కూడా బెల్లం తినడం మానుకోండి.

ఆర్థరైటిస్ సమస్య

బెల్లం రోజూ తింటే ఎంత ఆరోగ్యకరం అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. గర్భధారణ సమయంలో 10 గ్రాముల నుంచి 20 గ్రాముల మధ్య బెల్లం తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఎంత తినాలంటే