Shikai for Hair: శీకాయను ఎలా వాడితే మీ జుట్టు పెరుగుతుందో తెలుసా..

జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఈ విషయంలో మహిళలు ముందు ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం, తెల్లబడటం, పలుచగా ఉండటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు. దీంతో చాలా మంది మార్కెట్‌లో లభించే హెయిర్ ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తున్నారు. వీటితో మరిన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. అయితే శీకాయ జుట్టుకు ఎంతో మంచిదని చిన్నప్పటి..

Shikai for Hair: శీకాయను ఎలా వాడితే మీ జుట్టు పెరుగుతుందో తెలుసా..
Shikai
Follow us

|

Updated on: Jul 04, 2024 | 1:45 PM

జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఈ విషయంలో మహిళలు ముందు ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం, తెల్లబడటం, పలుచగా ఉండటం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు. దీంతో చాలా మంది మార్కెట్‌లో లభించే హెయిర్ ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తున్నారు. వీటితో మరిన్ని సమస్యలు వచ్చి పడుతున్నాయి. అయితే శీకాయ జుట్టుకు ఎంతో మంచిదని చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. కానీ దీన్ని ఎలా వాడాలో చాలా మందికి ఇప్పటికీ తెలీదు. శీకాయను సరైన విధంగా వాడితే జుట్టు ఆరోగ్యంగా, బలంగా, ఒత్తుగా పెరుగుతుంది. మరి జుట్టు సమస్యలను తగ్గించుకోడానికి శీకాయను ఎలా వాడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జుట్టును అందంగా, శుభ్రంగా ఉంచడంలో శీకాయ ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది. శీకాయను వాడటం వల్ల తలపై, జుట్టుప ఉండే మురికి, సూక్ష్మ క్రిములు ఏమన్నా ఉంటే పోతాయి.

2. జుట్టుకు శీకాయ నేచురల్ క్లెన్సర్‌గా పని చేస్తుంది. తలపై ఉండే చుండ్రు, తామర, దురద వంటివి కూడా పోతాయి. తలపై ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

3. శీకాయలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బల పరిచి.. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

4. శీకాయను తరచూ ఉపయోగించడం వల్ల ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది. చుండ్రు, దురద, తామర వంటివి కూడా తగ్గుతాయి.

5. జుట్టు పలుచగా ఉన్నారు శీకాయను వాడితే.. ఒత్తుగా, బలంగా మారుతుంది. చివర్లు చిట్లడం తగ్గుతుంది.

6. శీకాయ ఉపయోగించడం వల్ల జుట్టు సహజంగానే షైనీగా కనిపిస్తుంది. శీకాయ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే కొందరికి ఇది సరిగా పడక పోవచ్చు. దురద, దద్దర్లు వంటివి రావచ్చు. అలాంటి వారు వాడక పోవడమే మంచిది.

ఎలా వాడాలి:

శీకాయను, ఉసిరి కాయను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉసిరి పొడి అయినా పర్వా లేదు. ఉదయం వీటిని నీటితో సహా స్టవ్ మీద పెట్టి మరిగించండి. కాస్త దగ్గర పడ్డాక.. మిశ్రమాన్ని వడకట్టి స్టోర్ చేసుకోండి. దీన్ని హెయిర్ కి షాంపూలా ఉపయోగించవచ్చు. ఇంకా చాలా రకాలుగా శీకాయను వాడవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
అంగన్వాడి కోడి గుడ్డులో కోడి పిల్ల ప్రత్యక్షం.. వీడియో వైరల్.!
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
మోదీ విగ్రహం.. అద్భుతం.! 6.5 అడుగుల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు..
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
జీతాలు పెంచారని యజమానులకు జైలు శిక్ష.! 10 మందికి మూడేళ్ల శిక్ష.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
ఇంత అభిమానం ఏంటయ్యా. అద్దె కారులో వెళ్తున్న ఎమ్మెల్యేకు గిఫ్ట్.!
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పాత బకాయిలు అడిగారని.. షాపునే ధ్వంసం చేసేశారు.! వీడియో వైరల్..
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
పగబట్టిన పాము! 45 రోజుల్లో ఐదుసార్లు కాటు.. అయినా..!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
అంబానీ ఫ్యామిలీ పెద్ద మనసు.. ఘనంగా పేదలకు పెళ్లిళ్లు.!
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
కుక్కలు బాబోయ్‌.. కుక్కలు.! తెలుగు రాష్ట్రాల్లో పిచ్చికుక్కలు..
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
154 ఏళ్ల తర్వాత నల్లమలలో కనిపించిన అరుదైన జంతువు.!
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.
ఎంత వయస్సు వచ్చిన ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే ఈ పండ్లు తినండి.