వామ్మో..! ఇష్టంగా కబాబ్స్ తింటున్నారా.. అయితే ఈ విషయం తెలిస్తే షాకే..

నాన్ వెజ్ అనగానే మనకు ముందుగా చికెన్‌ వంటకాలు గుర్తుకు వస్తాయి. ఆ తర్వాతే మరేదైనా.. చికెన్‌తో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. వాటికి కాస్తా ఫుడ్‌ కలర్‌ దట్టించామంటే ఆ వంటకాల మీది నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే. ఎప్పుడెప్పుడు లాగించేద్దామా అన్నట్లుగా కంటికి ఇంపుగా కనిపిస్తుంటాయి. నాన్‌ వెజ్‌ అనే కాదు వెజ్‌ వంటకాలు ఆకట్టుకోవడంలోనూ ఫుడ్‌ కలర్‌ ప్రభావం అంతా ఇంతా కాదు అంటే నమ్మండి.

వామ్మో..! ఇష్టంగా కబాబ్స్ తింటున్నారా.. అయితే ఈ విషయం తెలిస్తే షాకే..
Chicken Kabab
Follow us
K Sammaiah

| Edited By: TV9 Telugu

Updated on: Jul 05, 2024 | 4:58 PM

కంటికి ఇంపుగా కనిపిస్తేనే పంటికి చేరుతుందనేది నానుడి. వెజ్‌, నాన్‌ వెజ్‌ వంటకాలు ఏవైన సరే వారి వారి అభిరుచులను బట్టి కంటికి నచ్చిన ఆహారాన్ని తినేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వంటకాలు ఆకర్షణీయంగా కనపడేందుకు రకరకాల ఫుడ్‌ కలర్స్‌ వాడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్స్‌, హోటల్స్‌ ఎక్కడైనా సరే గుమగుమలాడే వంటకాల్లో ఫుడ్‌ కలర్స్‌ యాడ్‌ చేయడం అనేది సర్వ సాధారణంగా మారింది. ఫుడ్‌ కలర్స్‌ ఆహార ప్రియులను ఆకర్షించే మాట అటుంచి ఆరోగ్యంపై మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌ తయారీలోనూ ఫుడ్‌ కలర్స్‌ వాడకం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

నాన్ వెజ్ అనగానే మనకు ముందుగా చికెన్‌ వంటకాలు గుర్తుకు వస్తాయి. ఆ తర్వాతే మరేదైనా.. చికెన్‌తో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. వాటికి కాస్తా ఫుడ్‌ కలర్‌ దట్టించామంటే ఆ వంటకాల మీది నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే. ఎప్పుడెప్పుడు లాగించేద్దామా అన్నట్లుగా కంటికి ఇంపుగా కనిపిస్తుంటాయి. నాన్‌ వెజ్‌ అనే కాదు వెజ్‌ వంటకాలు ఆకట్టుకోవడంలోనూ ఫుడ్‌ కలర్‌ ప్రభావం అంతా ఇంతా కాదు అంటే నమ్మండి. ముఖ్యంగా చికెన్‌ కబాబ్‌లో చాలా రకాలు ఉంటాయి. గార్లిక్ కబాబ్, చికెన్ 65, చికెన్‌ తందూరీ, చికెన్ టిక్కా, చికెన్ లాలిపాప్ ఇలా రకరకాల కబాబ్‌ వంటకాలు నాన్‌వెజ్‌ ప్రియులను నోరూరిస్తుంటాయి. అలాగే ఫిష్ కబాబ్‌లు కూడా నాన్ వెజ్ ప్రియులను ఎక్కువగా టెంప్ట్ చేస్తాయి. అటు వెజిటేరియన్లు వెబ్ కబాబ్‌లపై మనసు పారేసుకుంటున్నారు.  అయితే ఫుడ్‌కలర్స్‌ కారణంగా అవి కంటికి ఆకర్షణీయంగా కనిపిస్తాయి గానీ వాటిని లొట్టలేసుకుంటూ పొట్టలోకి జారవిడిచాక తెలుస్తుంది అసలు సినిమా.

మీ కంటికి ఆకర్షనీయంగా కనిపించే ఆహారం అంతా ఆరోగ్యమైనదే అని నమ్మితే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. ముఖ్యంగా ఫుడ్‌కలర్‌తో ఆకట్టుకునే ఆహారం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృత్రిమ రంగులు శరీరానికి హానికరమని, ఇవి ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో ఫుడ్‌ కలర్స్‌ యాడ్‌ చేయడం వలన క్యాన్సర్‌, బీపీ, మధుమేహం వంటి జబ్బులను డబ్బులిచ్చి కొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు.

Chicken Kabab

Chicken Kabab

ఫుడ్‌ కలర్స్‌ ఎలా తయారు చేస్తారు?

పెట్రోలియం ఉత్పత్తులను రసాయన సమ్మేళితం చేయడం ద్వారా ఫుడ్‌ కలర్స్‌ తయారు చేస్తారు. ఆహారాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు తయారు చేసే రసాయనాల సమ్మేళనాలే ఈ ఫుడ్‌ కలర్స్‌. స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌ వంటివి ఆకర్షణీయంగా కనిపించేందుకు కృత్రిమ రంగులు వాడుతుంటారు. కొన్ని బ్రాండ్‌ల పచ్చళ్లు, సలాడ్ డ్రెస్సింగ్‌లలో కూడా కృత్రిమరంగులు ఉపయోగిస్తారు. గతంతో పొల్చుకుంటే ఈ మధ్య కాలంలో ఫుడ్‌ కలర్స్‌ వినియోగం 50 శాతం పైగానే పెరిగింది.

ప్రజలు శతాబ్దాలుగా ఆహారంలో కృత్రిమ రంగులను కలిపుతున్నారు. మొదటి కృత్రిమ ఆహార రంగులు 1856 లో బొగ్గు తారు నుంచి తయారు చేశారు. నాటి నుంచి వందలాది ఫుడ్‌ కలర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే తమకు తెలియకుండానే ఆహారంలో విషాన్ని కలిపేసుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫుడ్‌ కలర్స్‌ వేటిలో ఉపయోగిస్తారు?

మిఠాయిల తయారీ, కొన్ని రకాల కేకులు, కూల్‌ డ్రింకులు, మద్యం, వేపుళ్లు, మసాలా తయారీ వంటి వాటిల్లో ఫుడ్‌ కలర్స్‌ అధికంగా ఉపయోగిస్తుంటారు. ఇటీవలి కాలంలో నాన్‌వెజ్‌ వంటకాల్లో ఫుడ్‌ కలర్స్‌ వినియోగం పెరిగిపోయింది. మిఠాయిలు, కేకులు, మసాలాలు, మాంసాహారానికి ఎరుపురంగును ఉపయోగిస్తుంటారు. ఇక బంగాళాదుంప చిప్స్, పాప్‌కార్న్‌ వంటి వాటికి పసుపురంగు ఫుడ్‌ కలర్‌ను యాడ్‌ చేస్తుంటారు.

ఐస్‌క్రీమ్, సూప్‌లు, బఠానీలు తదితరాలకు నీలం, ఆకుపచ్చ రంగులు కలిపేస్తుంటారు. మార్కెట్లో విక్రయించే సాస్‌లు, బిర్యానీ, తందూరీ చికెన్లలోనూ ఫుడ్‌ కలర్స్‌ వినియోగిస్తారు. చిన్న పిల్లలు తినే పీచు మిఠాయి, పుల్ల ఐస్, జెల్లీ మొదలైన వాటిలోనూ ప్రమాదకర రంగులను కలిపేసి విక్రయించడం పరిపాటిగా మారింది.

ఫుడ్‌ కలర్స్‌ వల్ల దుష్ర్పభావాలు ఎంటి?

కృత్రిమ రంగులు కలిపిన ఆహారపదార్థాలు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాన్‌ వెజ్‌ వంటకాల్లో ఫుడ్‌ కలర్స్‌ వాడటం వలన అవి నాణ్యంగా, తాజాగా ఆకర్షిస్తాయి. రోజుల తరబడి నిల్వ ఉన్నవి కూడా తాజా పదార్థాలుగా భావించి అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. కారం, పసుపు, టీ, కాఫీపొడి వంటి ఉడికించని ఆహార పదార్థాల్లోనూ కృత్రిమ రంగులు కలుపుతున్నట్లు గుర్తించారు.

ఫుడ్‌ కలర్స్‌ కలిపిన ఆహారపదార్థాలను ఎక్కువ కాలం తినడం వల్ల క్యాన్సర్‌ మహమ్మారి సోకే ప్రమాదం ఉంది. పిల్లల్లో హైపర్‌ యాక్టివ్, అలర్జీ లక్షణాలు సంక్రమిస్తాయి. పురుషులు మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో పాటు జీర్ణకోశ వ్యాధులు, ఉబ్బసం వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. స్త్రీలకు రుతుసంబంధ ఇబ్బందులు, మైగ్రేన్‌ తలనొప్పి, థైరాయిడ్, గర్భకోశ, కిడ్నీ, కాలేయ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Chicken Kabab

Chicken Kabab

ఆహార కల్తీ నిరోధక చట్టం ఏం చెబుతుంది?

ఆహారాన్ని కల్తీ చేయడం, ప్రమాదకర ఆహారాలను విక్రయించడం నేరం. కల్తీ ఆహారం ప్రజలను రక్షించడానికి భారత్‌లో అనేక చట్టాలను పొందుపర్చారు. ఆహార కల్తీ నిరోధక చట్టం-1954, ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006, ఆహార ఉత్పత్తుల ప్రమాణాలు, ఆహారం రంగు, రుచి, నిల్వ కోసం కలిపే పదార్థాల నియంత్రణ నిబంధనలు-2011 తదితర చట్టాలన్నీ ఆహార పదార్థాల విక్రయాలపై ఓ కన్నేసి ఉంచేందుకే. అయినా కొందరు స్వార్థపరులు చట్టాలను తుంగలో తొక్కి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటుననారు.

Chicken Kabab

Chicken Kabab

వ్యాపారులు, వినియోగదారుల అవగాహన లేమి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫుడ్‌ కలర్స్‌ కలిపిన, నాణ్యత లేని, కలుషితమైన ఆహారపదార్థాలు మార్కెట్‌లోకి వదులుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కృత్రిమ రంగులను ఎక్కువగా పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారు చేస్తున్నారు. అవి ఆరోగ్యానికి ప్రమాదకరమని పరిశోధకులు గుర్తించారు. గడిచిన సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఫుడ్‌ కలర్స్‌ వ్యాపారం సుమారు 40 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆర్థిక వేత్తల అంచనా. అందులోనూ చైనా, భారతత్‌ వంటి ఆసియా దేశాలే అత్యధిక శాతం వాటా కలిగి ఉన్నాయి.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫుడ్‌ కలర్స్‌ దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవాలంటే పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాసెస్డ్‌ చేసిన ఆహారపదార్థాలను కొనుగోలు చేసేటప్పుడు వాటిలో ఫుడ్‌ కలర్స్‌ కలిపారా లేదా అని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలి. ఆహార పదార్థాల ప్యాకెట్ల మీద పొందుపరిచిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని సూక్ష్మంగా పరిశీలించాలి. అధిక మొత్తంలో సింథటిక్‌ రంగులు వాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లకపోవడమే ఉత్తమం. కృత్రిమ రంగుల స్థానంలో క్యారట్, బీట్‌రూట్, గోధుమగడ్డి, పాలకూర, కుంకుమపువ్వు తదితరాలతో సహజసిద్ధంగా తయారు చేసిన రంగులను వినియోగించేలా అవగాహన కల్పించాలి.

పసుపు పొడిని వాడటంవల్ల ఆహారానికి మంచి రంగు వస్తుంది. అంతే కాకుండా నేచురల్‌ యాంటీబయాటిక్‌గానూ పనిచేస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆహార తయారీ, విక్రయ కేంద్రాల్లో అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రమాదకర రంగులు వాడుతున్న వారికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్యాకెట్లలో విక్రయించే ఆహారాల్లో వాడిన పదార్థాల గురించి వాటిపై ముద్రించేలా చర్యలు చేపట్టాలి. ఆహారకల్తీని, ఫుడ్‌ కలర్స్‌ వాడకాన్ని జీరో శాతానికి తగ్గించాలి. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI)ఆమోదం పొందిన రంగులనే వినియోగించేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం ఆహార పదార్థాల తయారీదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందించాలి.

పానీపూరీలో క్యాన్సర్‌ కారకాలు:

స్ట్రీట్‌ ఫుడ్‌లో వెరీ ఫేమస్‌ పానీపూరీ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరీని ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. చాలా వరకు పానీపూరీ నమూనాల్లో వాటి సాస్‌, స్వీట్‌ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. శాంపిళ్లలో సన్‌సెట్‌ యెల్లో, బ్రిలియంట్‌ బ్లూ, కార్మోసిన్‌ రంగులు ఉన్నట్టు తేల్చారు. ఇటీవల బెంగళూరులో 50 శాంపిల్ష్ సేకరించి పరిశోధించగా అంఉదలో20 శాంపిళ్లలో సింథటిక్‌ రంగులు బయటపడ్డాయి. పానీ పూరీ తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాస్‌లు, స్వీట్‌ చిల్లీ పౌడర్లను నిషేధించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

Pani Poori

Pani Poori

ఫుడ్‌ కలర్స్‌పై పలు రాష్ట్రాల్లో నిషేధం:

వెజ్‌, నాన్‌ వెజ్‌ వంటకాల్లో కృత్రిమ రంగలు వాడకంపై పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఫుడ్‌ కలర్స్‌ వల్ల వాటిల్లే దష్ర్పభావాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాయి ఇటీవల గోబీ మంచూరియా, కబాబ్‌ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. వెజ్‌-నాన్‌ వెజ్‌ కబాబ్స్‌లో కృత్రిమ రంగులు కలపడం వల్ల ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఫుడ్‌ కలర్స్‌ వినియోగించడాన్ని బ్యాన్‌ చేసింది. చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించారు.

కేరళలోనూ కబాబ్‌ల తయారీలో కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే కబాబ్‌ల నమూనాలను సేకరించి పరీక్షించారు. కబాబ్‌లన్నీ నాసిరకంగా ఉన్నాయని తేల్చారు. దీంతో కేరళలోనూ చికెన్‌ కబాబ్‌లలో ఫుడ్‌ కలర్స్‌ వాడకూడదని స్ట్రిక్ట్‌గా ఆదేశాలు జారీ చేశారు. ఇక కాటన్‌ క్యాండీ(పీచు మిఠాయి)లో కలిపే కృత్రిమ రంగులపైనా అధికారులు చర్యలు చేపట్టారు.

ముందే మేల్కొన్న తమిళనాడు:

ఫుడ్‌ కలర్స్‌ దుష్ర్పభావాలపై తమిళనాడు అన్ని రాష్ట్రాలకన్నా ముందే అప్రమత్తమైంది. వెజ్‌, నాన్‌వెజ్‌ కబాబ్స్‌, పీచుమిఠాయిల తయారీలో ఫుడ్‌ కలర్స్‌ను నిషేధించింది స్టాలిన్‌ ప్రభుత్వం. పేపర్‌ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగించే రోడమైన్‌-బి, టాట్రజైన్‌, కార్మోయిజిన్‌, సన్‌సెట్‌ యెల్లో వంటి కెమికల్స్‌ను కలుపుతున్నట్లుగా గుర్తించారు. ఈ రసాయనాలు ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్లినట్లయితే కిడ్నీ, లివర్‌ దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. అల్సర్‌ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందనే హెచ్చరికల నేపథ్యంలో స్టాలిన్‌ ప్రభుత్వం పీచుమిఠాయిపై నిషేధం విధించింది.

అయితే హార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల నిషేధంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఎప్పుడో ఫిర్యాదులు అందితేనే అధికారులు స్పందిస్తున్నారు తప్పా నిరంతర నిఘా పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందనే సత్యాన్ని ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకుని మసలుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసి వారి జేబులకు చిల్లులు పెట్టే ఫుడ్‌ కలర్స్‌పై ప్రభుత్వాలు నిరంతర జాగరూకతతో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ