Beauty Tips: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెరుగుతో ఇలా చేస్తే మీరు ఊహించని అందం మీ సొంతం..
ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. పెరుగు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా సూపర్‌గా పనిచేస్తుంది. పెరుగుతో ఖర్చు లేకుండా మీ అందాన్ని పెంచుకోవచ్చు. పెరుగుకు కొన్ని పదార్థాలను కలిపి ముఖానికి రాసుకుంటే అందమైన మెరుపు వస్తుంది. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తమ అందాన్ని పెంచుకోవడానికి చాలా మంది రకరకాల పద్ధతులు ట్రై చేస్తుంటారు. మార్కెట్‌లో ఏదైనా కొత్త క్రీమ్ రాగానే వాడడం స్టార్ట్ చేస్తారు. క్రీముల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే డబ్బు ఖర్చు చేయకుండానే మీ ముఖం మెరుపును పెంచుకోవచ్చు. అవును.. పెరుగు రాసుకుంటే మీ ముఖం మెరుస్తుంది. పెరుగు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా బాగా పనిచేస్తుంది. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
పెరుగుతో ఇలా చేయండి..
మీ ముఖంపై టాన్ ఉంటే.. పెరుగుతో మసాజ్ చేయాలి. దీన్ని కోసం 3 టేబుల్ స్పూన్ల పెరుగును కొద్దిగా నీటితో కలిపి ముఖంపై మసాజ్ చేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి మీ ముఖాన్ని నీటితో కడగాలి.
రోజ్ వాటర్ – పెరుగు:
మీ ముఖంపై టాన్ లేదా మీకు ఏవైనా దద్దుర్లు ఉంటే.. పెరుగు – రోజ్ వాటర్ కలిపి మీ ముఖంపై ప్యాక్ వేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి మీ ముఖాన్ని నీటితో కడగాలి. దీన్ని ముఖం మెరిసిపోతుంది.
ఎండకు ముఖం నల్లగా మారితే..
ఎండలో తిరిగితే చర్మం నల్లగా మారతుంది. నల్లబడిన చర్మానికి పెరుగు – పసుపు ప్యాక్ ట్రై చేయండి. అర టీస్పూన్ పసుపును 3 టేబుల్ స్పూన్ల పెరుగుతో కలిపి ముఖంపై అప్లై చేయండి. దీన్ని వారానికి 2-3 సార్లు అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
పెరుగు – తేనె:
1 టీస్పూన్ తేనెను 2 టేబుల్ స్పూన్ల పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో ముఖం కడుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.
పెరుగు – నిమ్మరసం:
నిమ్మరసం చర్మానికి మంచిది. 1 టేబుల్ స్పూన్ పెరుగుతో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ముఖం మెరిసిపోతుంది.
టమాట – పెరుగు
టమాటో పేస్ట్ – పెరుగును సమాన పరిమాణంలో కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాలు తర్వాత కడుక్కోవాలి. ఇది చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది.
పెరుగు – బార్లీ పిండి:
కొద్దిగా పెరుగు – బార్లీ పిండిని కలిపి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కడుక్కుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
పెరుగు యొక్క ప్రయోజనాలు:
పెరుగు చనిపోయిన చర్మాన్ని తొలగించి.. ప్రకాశవంతం చేస్తుంది. నల్లటి మచ్చలను తగ్గిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




