ముఖంపై మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా..? ఓసారి ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేసి చూడండి..!
చర్మం పై మొటిమలు రావడం చాలా సాధారణం. అయితే వాటిని తగ్గించడానికి రసాయనాల జోలికి వెళ్లకుండా.. ఇంట్లో ఉండే సహజ పదార్థాల తోనే పరిష్కారం పొందొచ్చు. మొటిమల పై ప్రభావవంతంగా పని చేసే ఫేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

మొటిమలు రావడం చాలా మందికి కామన్ ప్రాబ్లమ్. అయితే దీనికి పరిష్కారం మన వంటగదిలోనే దొరుకుతుంది. కారం, ఎక్కువ నూనె, చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించి కొన్ని సహజమైన ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కొన్ని ఫేస్ ప్యాక్ ల గురించి వివరంగా తెలుసుకుందాం.
కలబంద గుజ్జుతో మెరుపు
కలబంద లోని ఔషధ గుణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. మొటిమలకు కారణమయ్యే క్రిములను తొలగిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ C, విటమిన్ E, బీటా కెరోటిన్ లాంటి పోషకాలు చర్మాన్ని పాడవకుండా కాపాడతాయి. రోజూ మీ ముఖానికి శుభ్రంగా కలబంద గుజ్జు రాసి 10 నిమిషాల తర్వాత కడిగేయండి. చర్మం తాజాగా మెరుస్తుంది.
పసుపుతో మచ్చలు మాయం
పసుపు సహజంగా బ్యాక్టీరియాను అడ్డుకుంటుంది. ఇది మొటిమల వల్ల వచ్చే ఎర్రదనాన్ని తగ్గిస్తుంది. దీని కోసం సగం టీస్పూన్ పసుపును. ఒక టీస్పూన్ కలబంద గుజ్జుతో బాగా కలిపి ముఖానికి రాయండి. 10 నిమిషాల తర్వాత శుభ్రంగా కడగాలి. ఇది చర్మాన్ని శుభ్రపరిచే సాధారణ మాస్క్ గా పని చేస్తుంది.
గ్రీన్ టీతో తాజా చర్మం
గ్రీన్ టీ చర్మానికి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి, ముడతలను తగ్గిస్తాయి. ఒక గ్రీన్ టీ బ్యాగ్‌ను వేడినీటిలో మరిగించండి. ఆ తర్వాత చల్లారిన తర్వాత దానిలో ఒక చెంచా కలబంద జెల్ కలిపి స్ప్రే బాటిల్‌లో పోయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై స్ప్రే చేయండి. ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా ఉన్న చోట ఎక్కువగా స్ప్రే చేస్తే మంచి ఫలితం వస్తుంది. 2 నుంచి 3 గంటల తర్వాత కడిగేయవచ్చు.
ఈ మూడు సహజ చిట్కాలు మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. మితంగా, క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మ సంరక్షణలో సహజ పద్ధతులు పాటిస్తే చర్మం పొడిబారకుండా.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే వాడాలి)




