Kitchen Hacks: వంటకు అల్యూమినియం పాత్రల కంటే ఇత్తడి పాత్రలు మంచివి.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
బ్రిటిష్ వారు మనకు పరిచయం చేసిన వస్తువుల్లో అల్యూమినియం పాత్రలు ఒకటి. వీటిని వంట కోసం ఉపయోగిస్తారు. దీనికి కారణం ధర తక్కువగా ఉండడం.. సులభంగా శుభ్రం చేసుకోవడానికి వీలు కలిగి ఉండడం అని చెప్పవచ్చు. అల్యూమినియం పాత్రలను తలతలా మెరిసేలా శుభ్రం చేసే స్త్రీలను తరుచుగా చూస్తూనే ఉంటాం.. అయితే వీటిలో చేసే వంట ఆరోగ్యానికి తంట అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కాలం ఒకే పాత్రలను వంటకు ఉపయోగించడం వలన అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఈ పాత్రలకు ప్రత్నామ్యాయంగా ఎ రకమైన పాత్రలను ఉపయోగించాలో కూడా సూచిస్తున్నారు.

భారతీయుల ఇళ్ళల్లో అల్యూమినియం పాత్రలను వంట చేయడానికి ఉపయోగిస్తారు. ఇవి సరసమైన ధరల్లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వీటిలో వంట చేస్తే త్వరగా అయిపోతుంది. అయితే ఈ పాత్రలలో వంట చేయడం వల్ల అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి ఉంటుదని అధ్యయనాలు చెబుతున్నాయి. అల్యూమినియం పాత్రల్లో ఆహారాన్ని వండటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలంటే
అల్యూమినియం తేలికైన లోహం. అద్భుతమైన వేడి వాహకం..అందుకే ఈ పాత్రల్లో వంట చేయడానికి ప్రధాన ఎంపికగా మారాయి. అయితే సుదీర్ఘకాలం వీటిల్లో వంట చేయడం వలన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. అల్యూమినియం బాక్సైట్ తో తయారు చేస్తారు. కాలక్రమేణా అల్యూమినియం పాత్రలలో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కాలేయం, నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అంతేకాదు అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లలో ఆహారాన్ని వండటం వలన ఆహారం పోషక విలువలు తగ్గుతాయి. అల్యూమినియం శరీరంలో పేరుకుపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
ఇత్తడి పాత్రలు ఉత్తమ ప్రత్యామ్నాయం
వంట చేయడానికి అల్యూమినియం పాత్రల కంటే ఇత్తడి పాత్రలను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇత్తడి పాత్రలలో వంట చేసుకోవడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఇత్తడిలో జింక్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్త గణనను పెంచడం, రోగనిరోధక పనితీరును పెంచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అంతేకాదు ఇత్తడి పాత్రల్లో చేసిన వంటని తినడం వలన శ్వాసకోశ ప్రయోజనాలున్నాయి.
ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇత్తడి పాత్రలు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇత్తడి పాత్రలో చేసిన ఆహారం తినడం వలన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : రాత్రంతా ఇత్తడి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం కూడా ఆరోగ్యకరం. ఉదయం ఆ నీటిని తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలపడుతుంది, మొత్తం ఆరోగ్య శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది.
ఇత్తడి పాత్రలో ఏ ఆహారాన్ని చేయవద్దంటే
ఇత్తడి పాత్రలు చాలా ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. వాటిలో ఆమ్ల ఆహార పదార్థాలను వండడానికి ఉపయోగించకూడదు. కాలక్రమేణా ఇత్తడి పాత్రల ఉపరితలంపై ఆక్సైడ్ పొర ఏర్పడవచ్చు. అప్పుడు టమోటాలు, వెనిగర్ లేదా నిమ్మకాయ వంటి ఆమ్ల పదార్థాలతో చర్య జరపవచ్చు. ఈ ప్రతిచర్య ఆహారం రుచి, రంగుపై ఆరోగ్య ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








