Vastu Tips: ఇంట్లో పాత బట్టలు పోగు చేసుకుంటున్నారా.. ప్రతికూలతకి వెల్కం చెప్పినట్లే.. పాత, చినిగిన బట్టలు ఏమి చేయాలంటే..
ఇంటి నిర్మాణం గురించి మాత్రమే కాదు ఇంట్లో పెట్టుకునే వస్తువులు పెట్టుకునే విషయంలో కూడా నియమాలున్నాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో పెట్టుకునే వస్తువులకు ఒక నిర్దిష్ట స్థానం, ప్రాముఖ్యత ఉందని చెబుతుంది. అదే విధంగా ఇంట్లో పాత, చిరిగిన, పనికిరాని దుస్తులను నెలల తరబడి ఇంట్లో పెట్టుకునే అలవాటు ఉంటే.. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ అలవాటు మంచిది కాదని.. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని.. ఇంట్లో ప్రతికుతలకు వ్యాపింపజేస్తాయని పేర్కొంది. ఈ రోజు ఇంట్లో ఉన్న పాత, చిరిగిన బట్టలను ఏమి చేయాలో తెలుసుకుందాం.. .

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టుకునే అనేక వస్తువులు శుభకరమైన, అశుభకరమైన ప్రభావాలు రెండింటినీ కలిగి ఉంటాయి. ఇంట్లోని శుభకరమైన వస్తువులు సానుకూల శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అదే విధంగా అశుభకరమైన వస్తువులు ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తిని వ్యాపింపజేసే కొన్ని వస్తువులు ఇంట్లో నెలల తరబడి ఉంటాయి. ఆలాంటి వస్తువుల్లో బట్టలు ఒకటి.. ఇంట్లో కొత్త, పాత బట్టలు రెండూ ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత, చిరిగిన, పనికిరాని బట్టల నుంచి ప్రతికూలత వ్యాపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పాత దుస్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఇంట్లో ఉన్న పాత దుస్తులను ఏమి చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.
- వాస్తు శాస్త్రం ప్రకారం, చిరిగిన, పాత, పనికిరాని బట్టలు అశుభాన్ని పెంచుతాయి. అంతేకాదు జీవితంలో మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి.
- వాస్తు శాస్త్రం ప్రకారం రంగు కోల్పోయిన బట్టలు, దుస్తులపై ఏదైనా మరకలు ఉండి వాడకుండా పక్కకు పెట్టేసిన, చిరిగిపోయి, వదులుగా ఉన్న బట్టలు అంటూ పక్కకి పెట్టేసిన దుస్తులు ఇంట్లో ప్రతికూలతను వ్యాపింపజేస్తాయి. కనుక ఇటువంటి దుస్తులను సుదీర్ఘ కాలం పక్కకు పెట్టేసి.. అకస్మాత్తుగా వాటిని ధరించకూడదు.
- వాస్తు శాస్త్రం ప్రకారం పాత, చిరిగిన దుస్తులను పేదవారికి ఎప్పుడూ దానం చేయకూడదు. మంచిగా ఉన్న దుస్తులను దానం చేయడం ఎల్లప్పుడూ మంచిదని భావిస్తారు. ఇతరులకు చిరిగిన, పాడైన వస్తువులు దానం చేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావాన్ని సృష్టిస్తుంది. ఆనందం , శాంతి ఉండదు.
- వాస్తు శాస్త్రం ప్రకారం పాత దుస్తులను మళ్ళీ కొత్త బట్టలు తయారు చేసుకోవడానికి ఉపయోగించే వారికి ఇవ్వవచ్చు. రీసైక్లింగ్ కేంద్రాలకు పంపవచ్చు.
- దీనితో పాటు చిరిగిన దుస్తులను తాళ్లు, శుభ్రపరిచే గుడ్డలుగా, కుట్టుపని కోసం, లేదా ఇంట్లో ఇతర అవసరాలకు ఉపయోగించవచ్చు.
- ఎప్పటికప్పుడు వార్డ్‌రోబ్‌ను శుభ్రం చేస్తూ ఉండండి. పాత దుస్తులను వేరు చేయండి. ఇలా చేయడం ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహాన్ని తగ్గిస్తుంది.
- జ్యోతిషశాస్త్రంలో పాత బట్టలు శనీశ్వరుడికి, రాహువులకు సంబంధించినవి. పాత బట్టలు ఉంచిన ఇళ్ళు శనీశ్వరుడి, రాహువు అశుభ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఇంటి నుంచి పాత దుస్తులను తీసివేయడం వలన ఈ గ్రహాల చెడు ప్రభావం తగ్గుతుంది. దీనితో పాటు శనివారం నల్లని దుస్తులను దానం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది.
- వాస్తు శాస్త్రం ప్రకారం పాత బట్టలను ఎప్పుడూ చెత్తలో వేయకండి, వాటిని కాల్చకండి.
- వాస్తు శాస్త్రం ప్రకారం, పాత దుస్తులను ధరించే విధంగా ఉంటే అవసరమైన వ్యక్తులకు దానం చేయవచ్చు. ఇలా చేయడం వలన ఇంట్లో సానుకూలతను తెస్తుంది. వాస్తు దోషాలను తొలగిస్తుంది. జీవితంలో శ్రేయస్సును తెస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








