AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budhh Dosha: ఈ లక్షణాలు కనిపిస్తే జాతకంలో బుధ దోషం ఉన్నట్లే.. పరిహారాలు, చేయాల్సిన దానాలు ఏమిటంటే..

జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు మానవ జీవితంపై ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు. కొన్నిసార్లు గ్రహాలు పురోగతికి ద్వారాలు తెరుస్తాయి. అయితే కొన్ని గ్రహాలు ఒక వ్యక్తి జీవితం సమస్యలతో నిండిపోయేలా అడ్డంకులను సృష్టిస్తాయి. అలాంటి గ్రహ దోషాల్లో ఒకటి బుధ దోషం. ఈ రోజు బుధ దోషానికి గల కారణాలు, పరిష్కారాలను తెలుసుకోండి.

Budhh Dosha: ఈ లక్షణాలు కనిపిస్తే జాతకంలో బుధ దోషం ఉన్నట్లే.. పరిహారాలు, చేయాల్సిన దానాలు ఏమిటంటే..
Budhh Dosha
Surya Kala
|

Updated on: Jul 30, 2025 | 9:04 AM

Share

బుధుడిని సాధారణంగా తెలివితేటలు, తర్కం, గణితం, కమ్యూనికేషన్, వ్యాపారానికి కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు శుభ స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తికి వాక్చాతుర్యం, పదునైన ఆలోచన శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని అందిస్తాడు. అయితే అదే బుధుడు పాప గ్రహం ప్రభావంలోకి వచ్చినప్పుడు లేదా జాతకంలో తక్కువ స్థానంలో ఉన్నప్పుడు.. బుధ దోషం ఏర్పడుతుంది.

చాలా మందికి ఈ దోషం గురించి తెలియదు. జీవితంలో పదే పదే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, కమ్యూనికేషన్ వైఫల్యం, చర్మ రుగ్మతలు, మానసిక అశాంతి ఈ గ్రహం దుష్ప్రభావాల వలన కావచ్చు. బుధ దోషం అంటే జాతకంలో బుధ గ్రహం ప్రతికూల ప్రభావం. ఇది వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది. ఈ దోషం ఉన్నవారి తెలివితేటలను గందరగోళానికి గురి చేస్తుంది. మాటలను కఠినంగా చేస్తుంది. వ్యాపారాన్ని వైఫల్యం వైపు నెట్టివేస్తుంది.

జాతకంలో బుధ దోషం అంటే ఏమిటి?

  1. జాతకంలో బుధ గ్రహం ఈ క్రింది స్థానాల్లో ఉన్నప్పుడు.
  2. శత్రు గ్రహాలతో (కుజుడు, రాహువు, శని వంటివి) సంయోగం.
  3. ఇవి కూడా చదవండి
  4. దుష్ట గ్రహాల దృష్టిలోకి రావడం.
  5. నీచ రాశి (మీన రాశి) లో ఉండటం.
  6. రాహువు లేదా కేతువుతో సంయోగం ఉంటే ఆ వ్యక్తి బుధ దోషాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

బుధ దోష లక్షణాలు

  1. ప్రసంగ లోపాలు: తరచుగా అబద్ధాలు చెప్పడం, అసభ్యకరమైన భాష, సంభాషణలో గందరగోళం.
  2. మానసిక అస్థిరత: నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది. ఆలోచనల గందరగోళం.
  3. చర్మం, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏర్పడడం.
  4. వ్యాపారంలో నిరంతర వైఫల్యాలు.
  5. చదువులో అడ్డంకి, జ్ఞాపకశక్తి లోపం.
  6. నిరాశ , చిరాకు. సామాజిక అపార్థాలకు బలి అవుతున్నారు.
  7. బుధ దోష నివారణకు ఏమి చేయాలంటే
  8. బుధ దోషాన్ని నివారించడానికి బుధవారం ఉపవాసం ఉండండి.
  9. ఆకుపచ్చ దుస్తులను ధరించండి.
  10. తులసి మొక్కను, విఘ్నాలకధిపతి గణపతిని పూజించండి.
  11. రోజులో ఒకపూట మాత్రమే సాధారణ భోజనం తినండి.
  12. “ఓం బ్రాం బ్రీం బ్రౌం సః బుధాయ నమః” అనేది బుధ గ్రహానికి సంబంధించిన బీజ మంత్రాన్ని జపించండి
  13. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు జపించండి ముఖ్యంగా బుధవారం రోజున జపించండి.
  14. జ్యోతిష్యుడిని సంప్రదించిన తర్వాత.. , ప్రత్యేక బుధ శాంతి పూజ చేయించుకోండి.

జ్యోతిష పరిహారాలు

  1. బుధవారం గణేష్ ఆలయంలో పంచామృత అభిషేకం చేయండి.
  2. బుధ గ్రహం దశ-మహాదశ సమయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.
  3. బుధ దోషాన్ని శాంతింపజేయడానికి రుద్ర అభిషేకం చేయండి.
  4. గణేశుడికి 21 దర్భలను సమర్పించండి.
  5. పెసలు, కూరగాయలు, పచ్చని బట్టలు, కంచు పాత్రలను దానం చేయండి.
  6. బ్రాహ్మణులకు బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి.
  7. తులసి దళాలను తినడం వలన మానసిక శుద్ధి అవుతుంది. అంతేకాదు బుధ గ్రహాన్ని శాంతపరచడంలో సహాయపడుతుంది
  8. జాతకం ప్రకారం అర్హత ఉంటే.. పచ్చ రత్నాన్ని ధరించండి.
  9. జ్యోతిష్యం ప్రకారం బుధ గ్రహం మిథున, కన్యా రాశుల వారిని, 5, 14, 23 తేదీలలో జన్మించిన వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని నమ్ముతారు.
  10. ఇది విద్యార్థులు, వక్తలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

బుధ దోషాన్ని తక్కువ అంచనా వేయకండి. ఇది కమ్యూనికేషన్, ఆలోచనా శక్తిని ప్రభావితం చేయడమే కాదు కెరీర్, సంబంధాలు, ఆరోగ్యంపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సరైన సమయంలో ఈ దోషాన్ని గుర్తించి పరిహరాలను చేయడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయి. జీవితంలో పదే పదే సమస్యలను ఎదుర్కొంటుంటే జన్మ కుండలిలో బుధుడి స్థానాన్ని ఒకసారి తనిఖీ జ్యోతిష్యుడిని సంప్రదించండి.

Follow Us
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
ఒకే ఒక్క క్షణం.. మాటలకందని విషాదం.. మిత్రుల కళ్ల ముందే ఘోరం
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సడెన్‌గా పులి ఎదురైతే ఏం చేయాలి..? ఇలా చేస్తే ఈజీగా
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఎలా చేయాలంటే?
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
లార్డ్స్‌లో చెలరేగిన టీమిండియా సెన్సేషన్.. తొలి భారత ప్లేయర్‌గా..
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ బిల్లు ఎవరు కడతారు?
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
తెలుగులో ఆ స్టార్ హీరో నాకు ఆరాధ్య దైవం..
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
బావిలో తొంగి చూస్తే భారీ గిరినాగు.. ఏం చేసారో తెలుసా..?
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
స్విట్జర్లాండ్ ట్రిప్‌కెళ్లిన హైదరాబాద్ దంపతుల మిస్టరీ మిస్సింగ్
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
6 సంవత్సరాల తర్వాత మళ్లీ.. 30 రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం..!
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ
ప్రపంచ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ డేంజరస్ జోడీ