Chanakya Niti: ఆ 4 అలవాట్లు మీకుంటే విజయ శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయం అన్న ఆచార్య చాణక్య
ఆచార్య చాణక్య గొప్ప పండితుడు, గురువు , నీతి కోవిదుడు. నేటికీ చాణక్య చెప్పిన విషయాలు ప్రజల జీవితాలకు సరైన దిశానిర్దేశం చేయడంలో సహాయపడతాయి. చాణక్య నీతిలో అనేక విషయాలు ఉన్నాయి. వాటిని మన జీవితంలో స్వీకరించినట్లయితే విజయం ఖాయం. చాణక్య చెప్పిన ఈ నాలుగు విషయాలు జీవితంలో పాటించే వ్యక్తి పాదాలను విజయం ముద్దాడుతుందట.

ఆచార్య చాణక్య భారతదేశపు గొప్ప రాజకీయ నాయకుడిగా, జ్ఞాన భాండాగారంగా పరిగణించబడ్డాడు. జీవితానికి సంబంధించిన ప్రతి అంశంపై ఆయన చెప్పిన విధానాలు నేటి జీవితానికి అనుసరణీయం అని పెద్దలు చెబుతారు. చాణక్య చెప్పిన నీతి శాస్త్రంలో వ్యక్తి విజయానికి సంబంధించిన అనేక విషయాలు పేర్కొన్నాడు. వ్యక్తి విజయం సాధించాలంటే బలంగా, తెలివిగా, లక్ష్యం వైపు దృష్టి కేంద్రీకరించే కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఎవరికైనా ఆ 4 అలవాట్లను పాటిస్తుంటే.. అటువంటి వ్యక్తి విజయాన్ని ఎవరూ ఆపలేరని చాణక్య చెప్పాడు. ఈ రోజు చాణక్య చెప్పిన మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకెళ్లే ఆ 4 అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం..
సమయానికి విలువ ఇవ్వండి సమయానికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి జీవితంలో ముందుకు సాగుతాడు. చాణక్యుడి ప్రకారం సమయం జీవితంలో అత్యంత విలువైనది. సమయాన్ని ఎప్పుడూ వృధా చేయవద్దు. ప్రతి పనిని సమయానికి ఎలా చేయాలో తెలిసిన వారు ఎప్పుడూ జీవితంలో చింతించాల్సిన అవసరం రాదని నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం విజయానికి మొదటి మెట్టు.
సంయమనం, క్రమశిక్షణను పాటించండి తమను తాము నియంత్రించుకునే వారికే విజయం లభిస్తుందని చాణక్యుడు చెబుతున్నాడు. జీవితంలో క్రమశిక్షణ, సంయమనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. తన భావోద్వేగాలను, కోరికలను నియంత్రించుకునే వ్యక్తి కష్ట సమయాల్లో కూడా సరైన నిర్ణయాలు తీసుకోగలడు. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షలోనూ ఉత్తీర్ణులవుతారు.
నిరంతర విద్యార్ధి చాణక్యుడి ప్రకారం ప్రతిరోజూ కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. జ్ఞానం మాత్రమే ఎప్పటికీ తరగిపోని ఆస్తి. చదవడం, తెలుసుకోవడం, నేర్చుకోవడం అలవాటు చేసుకునే వారు ఏ పరిస్థితిలోనైనా పరిష్కారాలను కనుగొనగలరు. జ్ఞానం మీ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది.
సరైన వ్యక్తులతో స్నేహం చాణక్య నీతిలో సహవాసానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మీరు మంచితనం, తెలివైన వ్యక్తులతో కలిసి జీవిస్తుంటే వారి ఆలోచనలు, అలవాట్లు కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. చెడు సహవాసం చేసిన వ్యక్తి తన జీవిత విధానానిమార్చుకోవచ్చు, చెడు మార్గంలో పయనించే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక ఎప్పుడు స్నేహితులను తెలివిగా ఎంచుకోవాలని చాణక్య చెప్పాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








