AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో ఈ తప్పులు చేస్తున్నారా.. రాహు దోషానికి కారణం.. ఇంట్లో సుఖ సంతోషాలు దూరం..

ఇంటి నిర్మాణం గురించి వాస్తు శాస్త్రం అనేక విషయాలను తెలియజేస్తుంది. ఇల్లు, ఇంట్లో పెట్టుకునే వస్తువులు, గదులు ఇలా ప్రతి దానిని దిశ, దిక్కుల ఆధారంగా ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తుంది. అయితే వాస్తుని పట్టించుకోకుండా ఇంటిలో చేసే కొన్ని రకాల తప్పులు వలన ఆ ఇల్లు రాహు గ్రహ ప్రభావం బారిన పడుతుంది. ఆ ఇంట్లో నివసించే రాహు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక ఎవరైనా ఇంటిలో ఈ తప్పులు చేస్తే వెంటనే ఆ తప్పులను దిద్దుకోండి.

Vastu Tips: ఇంట్లో ఈ తప్పులు చేస్తున్నారా.. రాహు దోషానికి కారణం.. ఇంట్లో సుఖ సంతోషాలు దూరం..
Rahu Dosha
Surya Kala
|

Updated on: Jul 30, 2025 | 11:20 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు నవ గ్రహాల్లో ఒక గ్రహం. రాహు స్థానం క్షీణిస్తే ఆ వ్యక్తి జీవితాంతం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. రాహువు ప్రతికూలంగా ఉండటానికి కారణం.. చేసే కర్మలతో పాటు ఇంటి వాస్తుకు సంబంధించిన కొన్ని లోపాలు. కొంత మంది ప్రజలు తెలిసి లేదా తెలియక వాస్తుకు సంబంధించిన తప్పులు చేస్తారు. దీని కారణంగా జాతకంలో రాహువు స్థానం చెడుగా మారుతుంది. ఈ రోజు ఇంట్లో చేసే తప్పులు ఏమిటో తెలుసుకుందాం..

మంచం మీద తినడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచం మీద కూర్చుని ఆహారం తినడం అశుభమని భావిస్తారు. దీని వల్ల రాహువు ప్రతికూల ప్రభావాలను చూపడం ప్రారంభిస్తాడని నమ్ముతారు. మంచం మీద కూర్చుని ఆహారం తినే ఇంట్లో ప్రజలు ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కనుక మంచం మీద కూర్చుని ఆహారం తినవద్దు. నేలపై కూర్చుని ఆహారం తినడం వలన జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి.

నైరుతి దిశ లోపం వాస్తు శాస్త్రంలో నైరుతి దిశ రాహువుకు సంబంధించినది. అటువంటి పరిస్థితిలో ఇంటి ప్రధాన ద్వారం, తలుపులు నైరుతి దిశలో ఉండకూడదు. లేకుంటే జీవితంలో రాహువు ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. అలాగే నైరుతి మూలలో ఎప్పుడూ టాయిలెట్ లేదా బాత్రూమ్ నిర్మించకూడదు. ఈ దిశలో వీటి నిర్మాణం రాహువు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. జీవితంలోని ఆనందం, శాంతిలోపిస్తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఇంట్లో ముళ్ళ మొక్కలు పెంచితే ఇంట్లో ముళ్ళ మొక్కలను ఎప్పుడూ పెంచుకోరాదు. ఈ మొక్కల వల్ల రాహువు ప్రభావం పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉండటం కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది . కెరీర్‌లో కూడా సమస్యలను కలిగిస్తుంది. కనుక ముళ్ళ మొక్కలను ఇంటి బయట బహిరంగ ప్రదేశంలో పెంచుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ముళ్ళ మొక్కలను ఇంటి లోపల పెంచుకోలేదు.

ఇంటి చెత్త పోగువుతూ ఉంటే ఇంట్లో చెత్త ఎంత ఎక్కువగా ఉన్నా లేదా ఇల్లు అంతా అస్తవ్యస్తంగా ఉంటే రాహువు దుష్ప్రభావాలను ఎక్కువగా ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఎవరైనా సరే పొరపాటున కూడా ఇంట్లో చెత్త లేదా అనవసరమైన వస్తువులను పోగు చేసి ఉంచకూడదు. ముఖ్యంగా ఇంటి పూజా స్థలం, వంటగది, పడకగదిలో ధూళి, చెత్త పేరుకుపోకుండా శుభ్రంగా పెట్టుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి