రాజమౌళి హీరోగా చేసిన సినిమా ఏదో తెలుసా?
దర్శక ధీరుడు రాజమౌళి గొప్ప డైరెక్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన చాలా సినిమాల్లో కనిపించాడు తప్ప ఏ సినిమాలో హీరోగా నటించలేదు. కానీ డైరెక్టర్ రాజమౌళి కూడా ఓ సినిమాలో,హీరోగా నటించాడు. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే?
Updated on: Apr 22, 2025 | 3:08 PM

రాజమౌళి, బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఎస్ ఎస్ ఎంబీ 29 సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ దర్శకుడికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆస్కార్ తీసుకొచ్చారు. అయితే దర్శకుడే కాకుండా, ఈయనలో మంచి నటుడు కూడా ఉన్నారంట. జక్కన్న ఓ సినిమాలో హీరోగా కూడా నటించాడంట. ఇంతకీ ఆ సినిమా ఏది అంటే?

రాజమౌళి తన చిన్నప్పుడు బాల నటుడిగా పిల్లన గ్రోవి సినిమాలో నటించాడంట. ఈ సినిమాలో రాజమౌళి కీలక పాత్రలో చేశాడంట.ఈ మూవీకి కీరవాణి తండ్రి శివ శక్తి దర్శకత్వంవహించారు.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నిర్మాతగా చేశారు. ఇక ఈ సినిమాలో జేవీ సోమయాజులు, నిర్మలమ్మ, వంటివారు కీలక పాత్రలో నటిచారు. కానీ ఈ సినిమా విడుదల కాకుండా మధ్యలోనే ఆగిపోయిందంట.

ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ హీరో స్టూడెంట్ నెం1 సినిమాతో దర్శకుడిగా మారాడు.ఈ సినిమా తర్వాత చాలా చాలా సినిమాలు తీసినప్పటికీ ఫెయిల్యూర్సే ఎక్కవగా ఉన్నాయి. తర్వాత వరసగా సినిమలతో విజయాలు అందుకుంటూ స్టార్ డైరెక్టర్ గా మంచి పరు సంపాదించుకున్నాడు.



