Natural Tips for Oily Skin: జిడ్డు చర్మంతో చిరాకు వస్తుందా.. ఈ చిట్కాలతో చెక్ పెట్టేయండి!
ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చర్మం ఉంటుంది. కొందరికి డ్రై స్కిన్, మరి కొందరికి ఆయిలీ స్కిన్. డ్రై స్కిన్ వారి కంటే జిడ్డు చర్మం ఉన్నవారు మరిన్ని సమస్యలని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎంత కేర్ తీసుకున్నప్పటికీ.. ఇబ్బందులు పడుతూనే ఉంటారు. జిడ్డు చర్మం కారణంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. చర్మం జిడ్డుగా మారడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కానీ దీంతో వీరు బయటకు వెళ్లాలన్నా..

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన చర్మం ఉంటుంది. కొందరికి డ్రై స్కిన్, మరి కొందరికి ఆయిలీ స్కిన్. డ్రై స్కిన్ వారి కంటే జిడ్డు చర్మం ఉన్నవారు మరిన్ని సమస్యలని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎంత కేర్ తీసుకున్నప్పటికీ.. ఇబ్బందులు పడుతూనే ఉంటారు. జిడ్డు చర్మం కారణంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. చర్మం జిడ్డుగా మారడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కానీ దీంతో వీరు బయటకు వెళ్లాలన్నా.. ఏం చేయాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఈ చిట్కాలు ఎంతో హెల్ప్ చేస్తాయి. అవేంటో ఒకసారి లుక్ వేసేయండి.
పెరుగు ప్యాక్:
జిడ్డు చర్మం ఉన్నవారు పెరుగు ప్యాక్ వేసుకోవచ్చు. ముందు ముఖం శుభ్రం చేసుకుని.. ఆ తర్వాత పెరుగును ముఖం అంతా పట్టించండి. ఇది ఆరేంత వరకు అలా వదిలేయండి. ఇలా తరచూ చేయడం వల్ల జిడ్డు సమస్య క్రమంగా తగ్గుతుంది. అంతే కాకుండా ముఖం అందంగా మారుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత కణాలను తొలగిస్తుంది.
కాఫీ పౌడర్:
కాఫీ పౌడర్ తో కూడా చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. కాఫీ పౌడర్ లో కొద్దిగా వాటర్ కలిపి నేరుగా ముఖానికి అప్లై చేసి.. 10 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. చర్మంపై ఉండే ఆయిల్ ను కాఫీ పౌడర్ పీల్చుకుంటుంది.
అరటి పండు:
అరటి పండుతో కూడా ఆయిలీ స్కిన్ ను తగ్గించుకోవచ్చు. అరటి పండు గుజ్జును ముకానికి రాసుకోవడం వల్ల.. అరటి పండు ముఖంపై ఏర్పడే నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దీని వల్ల నల్ల మచ్చలు, జిడ్డు సమస్యలు రాకుండా చూస్తుంది.
బొప్పాయి పండు:
బొప్పాయిలో పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. అందులోనూ చర్మాన్ని కాపాడటంలో కూడా ఇది చాలా బాగా పని చేస్తుంది. బొప్పాయిలో విటమిన్లు ఎ, బి, సి లభిస్తాయి. బొప్పాయి గుజ్జును ముఖానికి అప్లై చేసి.. ఆరిపోయేదాకా ఉంచుకోండి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే.. ముఖం సాఫ్ట్ గా, గ్లోగా తయారవుతుంది. అలాగే జిడ్డు చర్మం కూడా మాయం అవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.