వేసవిలో బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ జావ తప్పక తీసుకోవాల్సిందే..

వేసవిలో బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ జావ తప్పక తీసుకోవాల్సిందే..

Jyothi Gadda

13 April 2025

రాగులు బలవర్ధకమైనవి. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి రాగుల పిండితో చేసిన పదార్థాలు తరచుగా తిన్నట్లైతే నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది.

రాగులు బలవర్ధకమైనవి. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నవారికి రాగుల పిండితో చేసిన పదార్థాలు తరచుగా తిన్నట్లైతే నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. 

ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లైతే పిల్లలు బాగా ఎదుగుతారు. వేసవిలో రాగి పదార్థాలను తీసుకోవడం ద్వారా కడుపులో మంటను తగ్గుతుంది.

ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లైతే పిల్లలు బాగా ఎదుగుతారు. వేసవిలో రాగి పదార్థాలను తీసుకోవడం ద్వారా కడుపులో మంటను తగ్గుతుంది. 

శరీరానికి చలవ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దాహార్తిని తగ్గిస్తుంది. వృద్ధులు వేసవిలో రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తింటే శరీరానికి శక్తి చేకూరుతాయి.

శరీరానికి చలవ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దాహార్తిని తగ్గిస్తుంది. వృద్ధులు వేసవిలో రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తింటే శరీరానికి శక్తి చేకూరుతాయి. 

30ఏళ్లు దాటిన మహిళలు, యువతులు కూడా ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్‌ ఎముకల పటుత్వానికి మేలు చేస్తుంది.

రాగి జావ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాగి జావ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అందులోనూ ఈ సమ్మర్ సీజన్ లో చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

రాగి జావలో మజ్జిగ, ఉప్పు వేసి కలిపి తాగాలి. ఇలా చేస్తే.. నీరసం, ఆందోళన తగ్గడంతోపాటుగా శక్తి పెరుగుతుంది. నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి.

శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు రాగులను రోజూ వారి ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక్క గ్లాస్ రాగి జావ తాగితే ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది. 

సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారకి ఉపశమనం కలిగిస్తుంది.