మీ ఆలోచనలు మీ అదుపులో ఉండటం లేదా.. ఆలస్యం చేయకుండా ఇలా చేయండి మరి!
samatha
12 april 2025
Credit: Instagram
ఆలోచించడం చాలా మంచిదే. కానీ కొంత మంది అతిగా ఆలోచిస్తూ అనేక సమస్యలను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఏవో భయాలు, ఆందోళనలతో సతమతం అవుతారు.
చిన్న విషయాలనే పెద్దగా ఆలోచిస్తూ... మానసికంగా, శారీరకంగా అనారోగ్యానికి గురి అవుతూ ఇబ్బందుల్లో పడుతారు.. అయితే ఆలోచనల నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి
మీ ఆలోచనలు మీ అదుపులో లేనట్లైతే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి మీకు ఇష్టమైన పాటలు వినాలి. ఆ సాంగ్స్ లోనే లీనైమై మీ మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.
ఆలోచనలు మీ మనసును కుదిపేస్తున్నప్పుడు, మీకు నచ్చిన వ్యక్తి లేదా మీ చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాసేపు మాట్లాడాలి దీని వలన మీరు ప్రశాంతంగా ఉంటారు.
మెడిటేషన్ అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన మీరు అతిగా ఆలోచిస్తున్నారు అనుకున్నప్పుడు కాసేపు కళ్లు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేయడం మంచిది.
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి టూర్స్ వెళ్తూ ఉండాలి. దీని వలన మీ ఆలోచనలు మీ అదుపులో ఉంటాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు.
కొంత మంది ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. వారి వలన మీరు కూడా నెగిటివ్ గా ఆలోచించడం మొదలు పెడతారు. అందువల్ల వారికి దూరం ఉండటం చాలా మంచిది.
మిమ్మల్ని బాధ పెట్టే సంఘటనలు, లేదా మీ మనసులోని ప్రతి కూల ఆలోచనలకు అక్షర రూపం ఇస్తే మీకు కాస్త ఉపశమనం కలుగుతుందంట.