Vitamin E: ముఖానికి నేరుగా విటమిన్ ఈ క్యాప్సూల్స్ రాస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

అందంగా ఉండాలని, నలుగురిలో ఆకర్షణగా నిలవాలని ఆడువారు అనుకుంటూ ఉంటారు. అందం గురించి అంతే కేర్ తీసుకుంటూ ఉంటారు. ముఖం అందంగా, కాంతివంతంగా, ఆకర్షణీయంగా ఉంటేనే ఎదుటి వారి చూపును మన వైపుకు తిప్పుకోగలం. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల కారణంగా ముఖం డల్‌గా మారుతుంది. ముఖంలో గ్లోని తెప్పించేందుకు ఎన్నో రకాల క్రీములు, ఫేషియల్స్..

Vitamin E: ముఖానికి నేరుగా విటమిన్ ఈ క్యాప్సూల్స్ రాస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
Vitamin E
Follow us

|

Updated on: Aug 05, 2024 | 8:28 PM

అందంగా ఉండాలని, నలుగురిలో ఆకర్షణగా నిలవాలని ఆడువారు అనుకుంటూ ఉంటారు. అందం గురించి అంతే కేర్ తీసుకుంటూ ఉంటారు. ముఖం అందంగా, కాంతివంతంగా, ఆకర్షణీయంగా ఉంటేనే ఎదుటి వారి చూపును మన వైపుకు తిప్పుకోగలం. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్ల కారణంగా ముఖం డల్‌గా మారుతుంది. ముఖంలో గ్లోని తెప్పించేందుకు ఎన్నో రకాల క్రీములు, ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలనే కొందరు ముఖానికి విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా అప్లై చేస్తారు. తెలిసీ తెలియకుండా నేరుగా ముఖంపై రాస్తూ ఉంటారు. దీని వలన కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. మరి ఇలా ముఖానికి విటమిన్ ఈ క్యాప్సూల్స్ రాయవచ్చా? రాస్తే ఏం జరుగుతుంది? ముఖంలో ఎలాంటి మార్పులు వస్తాయో? నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ ఈ అంటే..

విటమిన్ ఈ అనేది మన శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా చర్మం, జుట్టు అందంగా ఉండాలంటే విటమిన్ ఈ ఖచ్చితంగా కావాలి. అయితే విటమిన్ ఇప్పుడు నేరుగా మెడికల్ షాపుల్లో కూడా లభిస్తున్నాయి. ఈ క్యాప్సూల్స్‌తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా వీటిని ముఖానికి రాయడం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అయితే ఈ క్యాప్సూల్‌ని అప్లై చేసుకునే విధానం కూడా ఉంటుంది. అది ఇప్పుడు తెలుసుకుందాం.

టోనర్‌లో..

చాలా మంది నేరుగా విటమిన్ ఈ క్యాప్సూల్స్‌ రాసేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు వీటిని టోనర్లో కలిపి ఉపయోగించాలి. టోనర్ లేకపోయినా మీ ముఖానికి సూట్ అయ్యే ఫేస్ ఆయిల్, రోజ్‌ వాటర్‌లో కూడా మిక్స్ చేసి ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

క్లెన్సర్‌లో…

ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్‌ని క్లెన్సర్‌లో కూడా మిక్స్ చేసి ఉపయోగించవచ్చు. ఇలా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి గ్లో వస్తుంది. ముఖంపై మచ్చలు ఉంటే తగ్గుతాయి.

ఫేస్ ప్యాక్స్‌లో..

మీరు ముఖానికి ఉపయోగించే ఫేస్ ప్యాక్స్‌లో కూడా ఈ విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్‌ ని మిక్స్ చేసి ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుంది.

మాయిశ్చరైజర్‌తో..

మీరు ముఖానికి ఉపయోగించే ఫేస్ మాయిశ్చరైజర్‌లో కూడా విటమిన్ ఈ క్యాప్సూల్స్ మిక్స్ చేసి యూజ్ చేయవచ్చు. ఇలా రోజుకు రెండు సార్లు అప్లై చేస్తూ ఉండాలి. కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ చారడేసి కళ్ల సోయగాన్ని గుర్తు పట్టారా? చిరంజీవి మూవీలో ఛాన్స్
ఈ చారడేసి కళ్ల సోయగాన్ని గుర్తు పట్టారా? చిరంజీవి మూవీలో ఛాన్స్
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ షురూ.. ఆ ఉత్పత్తులపై భారీ తగ్గింపులు
మహేశ్- రాజమౌళి సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో
మహేశ్- రాజమౌళి సినిమాలో విక్రమ్.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరో
స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. దిమ్మతిరిగే ట్విస్ట్
స్నేక్ క్యాచర్‌ని కాటేసి చనిపోయిన నాగుపాము.. దిమ్మతిరిగే ట్విస్ట్
సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి