AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion Juice Uses: ఉల్లి రసం గురించి ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే.. అస్సలు వదిలి పెట్టరు!

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు కూడా అంటూ ఉంటారు. అన్ని పోషకాలు ఉల్లిపాయల్లో ఉన్నాయి. ఉల్లిపాయను ప్రతిరోజూ తీసుకుంటే అనేక సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. కేవలం ఉల్లిపాయలతోనే కాకుండా ఉల్లి రసంతో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా లభ్యమవుతాయి. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ ఆర్గానిక్ సల్ఫర్..

Onion Juice Uses: ఉల్లి రసం గురించి ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే.. అస్సలు వదిలి పెట్టరు!
Onion Juice
Chinni Enni
|

Updated on: May 17, 2024 | 1:46 PM

Share

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు కూడా అంటూ ఉంటారు. అన్ని పోషకాలు ఉల్లిపాయల్లో ఉన్నాయి. ఉల్లిపాయను ప్రతిరోజూ తీసుకుంటే అనేక సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు. కేవలం ఉల్లిపాయలతోనే కాకుండా ఉల్లి రసంతో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా లభ్యమవుతాయి. ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ ఆర్గానిక్ సల్ఫర్ కూడా ఉంటుంది. ఇవి ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతాయి. చర్మానికి, జుట్టుకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఉల్లిపాయలు ఎప్పుడూ మన ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. ఉల్లి రసంతో ఎలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది:

ప్రస్తుతం కాలంలో చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇలాంటి వారు ఉల్లిపాయ రసాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే కిడ్నీలో రాళ్లు, నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మూత్ర పిండాల్లో ఉండే మలినాలు బయటకు పోతాయి.

షుగర్ అదుపులో ఉంటుంది:

డయాబెటీస్ ఉన్నవారికి ఉల్లి రసం బెస్ట్ అని చెప్పొచ్చు. ఉల్లి రసం తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. పరగడుపున ఉల్లి రసం తాగితే.. షుగర్ కంట్రోల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

పొట్ట క్లీన్:

ఉదయం ఖాళీ కడుపున ఉల్లి రసం తాగితే.. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. అదే విధంగా పొట్ట క్లీన్ అవుతుంది. కడుపులో ఉండే మలినాలు బయటకు పోతాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

ఉల్లిపాయలో యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్, కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి:

కీళ్ల నొప్పులతో బాధ పడేవారు ప్రతి రోజూ ఉల్లి రసం తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. అలాగే ఆవ నూనెను ఉల్లి రసంతో కలిపి కీళ్ల నొప్పులు ఉన్నచోట మర్దనా చేస్తే.. తగ్గుముఖం పడతాయి

జుట్టుకి, చర్మానికి మేలు:

ఉల్లి రసం తాగినా, జుట్టుకు అప్లై చేసినా జుట్టు సమస్యలు అన్నీ తగ్గుతాయి. జుట్టు రాలడం, చిట్లడం, డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. ఉల్లి రసాన్ని పసుపు, కలబంద, కొబ్బరి నూనెతో కూడా కలిపి మిక్స్ చేసి రాసుకోవచ్చు. అదే విధంగా ఉల్లి రసం ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి