Health: టీ తాగితే కొలెస్ట్రాల్ పెరుగుతుందా.? నిపుణులు ఏమంటున్నారంటే..
ఇంతకీ టీ తాగడానికి కొలెస్ట్రాల్ పెరగడానికి మధ్య సంబంధం ఏంటనేగా మీ సందేహం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువ పాలు కలిపిన టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వు పెరుగుతుంది. దీని కారణంగా ధమనుల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. ఇది దీర్ఘకాలంలో రక్తపోటుకు దారి తీస్తుంది. టీ తాగడం వల్ల జీవక్రియ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతుంది...
భారతీయులను, టీని విడదీసి చూడలేము. టీ తాగకపోతే రోజు గడవని వారు ఎంతో మంది ఉంటారు. ఉదయం లేవగానే టీతో ప్రారంభించే వారు ఎంతో మంది ఉంటారు. అంతేనా కాస్త తలనొప్పిగా అనిపించినా, టైమ్‌పాస్ కాకపోయినా టీ తాగుతుంటారు. ఇద్దరు స్నేహితులు కలిసినా వెంటనే ఒక టీ తాగుదాం పదా అని అనుకుంటారు. అయితే టీ అప్పటికప్పుడు ఉత్సాహం కలిగించినా, పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అధిక టీ తీసుకోవడం వల్ల పలు సమస్యలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా ఉందని తాజాగా పరిశోధకులు చెబుతున్నారు.
ఇంతకీ టీ తాగడానికి కొలెస్ట్రాల్ పెరగడానికి మధ్య సంబంధం ఏంటనేగా మీ సందేహం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎక్కువ పాలు కలిపిన టీ తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వు పెరుగుతుంది. దీని కారణంగా ధమనుల్లో అడ్డంకులు ఏర్పడుతాయి. ఇది దీర్ఘకాలంలో రక్తపోటుకు దారి తీస్తుంది. టీ తాగడం వల్ల జీవక్రియ రేటు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ కారణంగా శరీరంలో కొవ్వును కరిగించే ప్రక్రియ క్రమంగా బలహీనపడుతుంది. దీంతో శరీరంలో సహజంగానే కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. కాబట్టి మోతాదుకు మించి టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెబుతున్నారు.
టీ అధికంగా తీసుకునే వారిలో కొలెస్ట్రాల్‌తో పాటు మరికొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో సంతృప్త కొవ్వులు పెరగడం వంటి సమస్య ఎక్కువుతుంది. అలాగే అసిడిటీ సమస్య వస్తుంది. మరీ ముఖ్యంగా పరగడుపున టీ తాగే వారిలో అసిడిటీ సమస్య ఎక్కువుతంది. అదే విధంగా కడుపుబ్బరం, జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయనని నిపుణులు చెబుతున్నారు. ఇక చర్మ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. టీని అధికంగా తాగే వారిలో మొటిమలు సమస్య వస్తుంది. రాత్రి పూట టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య వేధిస్తుందని చెబుతున్నారు. అల్సర్ వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక టీని అధికంగా తాగే వారిలో డీహైడ్రేషన్ సమస్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే రోజులో ఒకటి మహా అయితే రెండు అంతకంటే ఎక్కువసార్లు టీ తాగడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..