Chana Dal for Diabetes: శనగ పప్పుతో షుగర్ కంట్రోల్.. ఇంకా ఎన్నో లాభాలు..

శనగ పప్పు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. శనగ పప్పు లేకుండా ఎలాంటి తాళింపు పూర్తి కాదు. చాలా మందికి తాళింపులో వేసే శనగ పప్పు అంటే ఇష్టంగా తింటారు. శనగ పప్పును కేవలం తాళింపుగానే కాకుండా చాలా రకాల కూరలు కూడా చేస్తూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. శనగ పప్పుతో కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతో మంది..

Chana Dal for Diabetes: శనగ పప్పుతో షుగర్ కంట్రోల్.. ఇంకా ఎన్నో లాభాలు..
Chana Dal For Daibetes
Follow us

|

Updated on: Aug 12, 2024 | 1:54 PM

శనగ పప్పు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. శనగ పప్పు లేకుండా ఎలాంటి తాళింపు పూర్తి కాదు. చాలా మందికి తాళింపులో వేసే శనగ పప్పు అంటే ఇష్టంగా తింటారు. శనగ పప్పును కేవలం తాళింపుగానే కాకుండా చాలా రకాల కూరలు కూడా చేస్తూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. శనగ పప్పుతో కేవలం రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంతో మంది షుగర్ వ్యాధితో బాధ పడుతున్నారు. శనగ పప్పు తినడం వల్ల షుగర్‌ని కంట్రోల్ చేయవచ్చని పలు అధ్యాయాలు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శనగ పప్పు తినడం వల్ల ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వెయిట్ లాస్:

శనగ పప్పు తినడం వల్ల వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ శాతం అనేది మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది. కొద్దిగా తింటేనే కడుపు నిండి పోతుంది. ఎక్కువగా తినలేం. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు మీ డైట్‌లో శనగ పప్పును యాడ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

షుగర్ వ్యాధి కంట్రోల్:

శనగ పప్పు తినడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అనేది అధిక శాతంలో లభ్యమవుతుంది. దీని వల్ల కొద్దిపాటి ఆహారమే తీసుకుంటారు. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్ అవుతాయి. కాబట్టి షుగర్‌ పేషెంట్లు శనగ పప్పు తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి:

శనగ పప్పులో క్యాల్షియం, మెగ్నీషియం ఖనిజాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం:

శనగ పప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను శనగ పప్పు తగ్గిస్తుంది. అదే విధంగా రక్త పోటు కూడా పెరగకుండా చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. కాబట్టి గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. అదే విధంగా జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..