ఇంట్లోనే ఈజీగా చేసుకొనే ఇన్స్టంట్ కాలీఫ్లవర్ పచ్చడి..! ఎలా చేస్తారో తెలుసా..?
సాధారణంగా కాలీఫ్లవర్‌తో గోబీ ఫ్రై, పరోటా, గోబీ ఫ్రై తయారు చేసుకుంటాం. ఇది రుచికరంగా ఉంటాయి. కాలీఫ్లవర్ కేవలం రుచిలో కాదు.. ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అయితే, సీజన్ లేకపోయిన కాలీఫ్లవర్ తినాలి అనుకునే వారికి దీంతో పచ్చడి తయారు చేసుకోవచ్చు. అందుకే, ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ పచ్చడి ని ఏవిధంగా తయారు చేయాలి? దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం.

మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం తప్పనిసరి. శీతాకాలంలో మార్కెట్లో అనేక కూరగాయలు అందుబాటులో ఉంటాయి. వాటిలో కాలీఫ్లవర్ కూడా తాజాగా, తెల్లగా మెరుస్తూ కనిపిస్తుంది. ఈ సీజన్‌లో కాలీఫ్లవర్‌లో పురుగులు కూడా తక్కువగా ఉంటాయి. సాధారణంగా కాలీఫ్లవర్‌తో గోబీ ఫ్రై, పరోటా, గోబీ ఫ్రై తయారు చేసుకుంటాం. ఇది రుచికరంగా ఉంటాయి. కాలీఫ్లవర్ కేవలం రుచిలో కాదు.. ఆరోగ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అయితే, సీజన్ లేకపోయిన కాలీఫ్లవర్ తినాలి అనుకునే వారికి దీంతో పచ్చడి తయారు చేసుకోవచ్చు. అందుకే, ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ పచ్చడి ని ఏవిధంగా తయారు చేయాలి? దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం.
కాలీఫ్లవర్ పచ్చడి తయారీ, కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూద్ధాం..
క్యాలీఫ్లవర్- ఒకటి మీడియం సైజ్
ఉప్పు- తగినంత
పసుపు- హాఫ్ టీ స్పూన్
కారప్పొడి- రెండు టీ స్పూన్లు రుచికి తగినంత
ఆవాలు- రెండు టీ స్పూన్లు
మెంతులు- హాఫ్ టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు-10
ఇంగువ- చిటికెడు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- క్యాలీఫ్లవర్ పచ్చడి ని బట్టి
కరివేపాకు- రెండు రెమ్మలు
ఎండుమిర్చి- 2
తాజాగా ఉన్న కాలిఫ్లవర్ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి కాలీఫ్లవర్ కత్తిరించి ఉప్పు నీటిలో వేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తరువాత క్యాలిఫ్లవర్ని బాగా కడిగి.. బ్లంచ్ చేయడానికి ఒక గిన్నెలో నీరు పోసి ఉడికించండి. ట్రే మీద శుభ్రమైన నూలు వస్త్రం పరచండి. దానిపై క్యాలిఫ్లవర్ వేసి పరచాలి. తరువాత 2 గంటల పాటు ఎండలో ఆరబెట్టండి.
మరొక పాన్లో ఆవాల నూనెను స్టవ్ మీద వేడి చేయండి. మరొక వైపు ఒక గిన్నె తీసుకోండి. అందులో కాలీఫ్లవర్ ముక్కలను వేయండి. నూనెను బాగా వేడి చేసి.. కొంచెం చల్లారనివ్వండి. ఆపై క్యాబేజీలో ఉప్పు, ఆవాల పొడి, సోంపు పొడి, మెంతుల పొడి, మిరపకాయల పొడి, పసుపు పొడి, ఇంగువ, వెనిగర్ వేయండి. మసాలా దినుసులు వేసిన తరువాత, క్యాలిఫ్లవర్ లో నూనె వేసి.. అన్ని పదార్థాలు బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు మీ రుచికరమైన క్యాలిఫ్లవర్ పచ్చడి రెడీ అయినట్టే.
ఇక, ఈ పచ్చడి ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు. క్యాలీఫ్లవర్ పచ్చడి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. బరువు నియంత్రణకు కూడా మంచిది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎముకలకు బలం. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి క్యాలీఫ్లవర్ పచ్చడి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




