కరివేపాకుతో కలిగే లాభాలు పుష్కలం..! బరువు తగ్గటం నుండి మధుమేహం, కొలెస్ట్రాల్‌ వరకు..

|

Oct 29, 2023 | 9:28 PM

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 5 నుండి 6 కరివేపాకులను తీసుకుంటే, మీ జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. కరివేపాకులో ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, బీటా కెరటిన్‌, ఇనుము, క్యాల్షియం, పాస్ఫరస్‌, పీచు, మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. రోజూ నాలుగు కరివేపాకులను తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు కరిగి బరువు తగ్గుతారు. అధిక కొలెస్ట్రాల్‌ వల్ల రక్తం సరఫరా జరగదు. కనుక కరివేపాకు తింటే మేలు జరుగుతుంది.

కరివేపాకుతో కలిగే లాభాలు పుష్కలం..!  బరువు తగ్గటం నుండి మధుమేహం, కొలెస్ట్రాల్‌ వరకు..
Follow us on

వంటగదిలో ఇతర మసాలా దినుసుల మాదిరిగానే కరివేపాకు కూడా అంతే ముఖ్యం. భారతీయ వంటకాల్లో రుచి కోసం కరివేపాకును వాడుతుంటారు. అయితే, దీన్ని తీపి వేప అని కూడా పిలుస్తారని చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది పోహా, పప్పులు, కూరగాయలు, అనేక ఇతర వంటకాలలో ఉపయోగిస్తారు. కరివేపాకు రుచితో పాటు సువాసనను కూడా పెంచుతుంది. కరివేపాకు సువాసన, రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఔషద నిధి వంటిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాల్షియం, మెగ్నీషియం, రాగి, భాస్వరం, ఇనుము, మరెన్నో ఇందులో ఉన్నాయి. ఇందులోని ఔషధ గుణాల వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి, బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. దాని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అలాంటివారికి కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 5 నుండి 6 కరివేపాకులను తీసుకుంటే, మీ జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో మీరు ఈజీగా బరువు తగ్గుతారు. కరివేపాకులో ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, బీటా కెరటిన్‌, ఇనుము, క్యాల్షియం, పాస్ఫరస్‌, పీచు, మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. రోజూ నాలుగు కరివేపాకులను తినడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు కరిగి బరువు తగ్గుతారు. అధిక కొలెస్ట్రాల్‌ వల్ల రక్తం సరఫరా జరగదు. కనుక కరివేపాకు తింటే మేలు జరుగుతుంది.

కరివేపాకులో ఉండే యాంటీ ఎనీమియా గుణాల వల్ల రక్తహీనతతో బాధపడేవారికి చాలా మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, ఐరన్ మరియు జింక్ పుష్కలంగా లభిస్తాయి. కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ రెండూ రక్తాన్ని శోషించే మూలకాలను కలిగి ఉంటాయి. రక్తహీనతలో ఇది ప్రయోజనకరంగా ఉండటానికి ఇదే కారణం.

ఇవి కూడా చదవండి

మీకు షుగర్ సమస్య ఉంటే వెంటనే కరివేపాకు తీసుకోవడం ప్రారంభించాలి. కరివేపాకులో హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి. అంటే ఇది చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచదు. ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అవుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. అంతే కాదు, కరివేపాకు గుండెకు చాలా ఆరోగ్యకరమైనదిగా కూడా.. కరివేపాకు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో కూడా పని సహయపడుతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..