IRCTC: ఐఆర్‌సీటీసీ నుంచి సూపర్ టూర్ ప్లాన్.. సౌత్ ఇండియాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను..
టూర్ పూర్తి వివరాల విషయానికొస్తే.. తొలి రోజు భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు భువనేశ్వర్-రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుంది. సాయంత్రానికి వైజాగ్ చేరుకుంటుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత రెండో రోజు రాత్రికి రామనాథపురం చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వం చేరుకుంటారు. ఆరోజు రాత్రి హోటల్‌లో ఉండాల్సి ఉంటుంది...

దక్షిణ భారతదేశంలోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. టెంపుల్ టూర్ ఆఫ్ సౌత్ ఇండియా పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. రామేశ్వరం, మధుర మీనాక్షి ఆలయంతో పాటు పద్మనాభస్వామి ఆలయాలు టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. నవంబర్ 3వ తేదీనా ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొమ్మిది రాత్రులు, పది పగళ్ల పాటు టూర్ ఉంటుంది. భువనేశ్వర్ నుంచి రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్నం స్టేషన్స్‌లో ప్రయాణికులు ట్రైన్ ఎక్కొచ్చు.
టూర్ పూర్తి వివరాల విషయానికొస్తే.. తొలి రోజు భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు భువనేశ్వర్-రామేశ్వరం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరుతుంది. సాయంత్రానికి వైజాగ్ చేరుకుంటుంది. రాత్రంతా జర్నీ చేసిన తర్వాత రెండో రోజు రాత్రికి రామనాథపురం చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రామేశ్వం చేరుకుంటారు. ఆరోజు రాత్రి హోటల్‌లో ఉండాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయాన్నే రామనాథస్వామి ఆలయం, రామర్‌పాదం ఆలయం, పంచముఖ ఆంజనేయ ఆలయాల సందర్శన ఉంటుంది.
అనంతరం హోటల్‌లో విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం ధనుష్ కోటికి వెళ్తారు. ఇక నాలుగో రోజు పొద్దున కలాం మ్యూజియం చూసిన తర్వాత కన్యాకుమారికి బయలుదేరుతారు. సాయంత్రానికి కన్యాకుమారి చేరుకొని సూర్యాస్తమయాన్ని చూడొచ్చు. ఇక 5వ రోజు తెల్లవారు జామున కన్యాకుమారిలో సూర్యోదయాన్ని చూసుకొని కుమారి అమ్మన్ ఆలయానికి వెళ్తారు. ఆ ప్రదేశంలో మూడు సముద్రాలు కలిసే చోటు.. వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువర్ విగ్రహం, మహాత్మా గాంధీ మెమోరియల్, వ్యాక్స్ మ్యూజియం వంటివి చూసుకుని సన్ సెట్ అయిన తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు.
ఇక 6వ రోజు ఉదయాన్నే తిరుచందూర్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత పద్మనాభపురం ప్యాలెస్ మీదుగా తిరువనంతపురం వెళ్తారు. అనంతరం మధ్యాహ్నానికి తిరువనంతపురం చేరుకుని విశ్రాంతి తీసుకోవాలి. సాయంత్రం కోవలం బీచ్‌కు వెళ్తారు. 7వ రోజు ఉదయం అనంత పద్మనాభస్వామి ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం చిత్ర ఆర్ట్ గ్యాలరీ, నేపియర్ మ్యూజియం, నేచురల్ హిస్టరీ మ్యూజియం, అట్టుకల్ భగవతి ఆలయం, సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం, ప్లానిటోరియం వంటివి విజిట్ చేసి రాత్రికి హోటల్‌లో స్టే చేస్తారు.
8వ రోజు ఉదయం మధ్యాహ్నానికి మధురై చేరుకుంటారు. అనంతరం అక్కడ తిరుమలై నాయకర్ మహల్, మీనాక్షి అమ్మవారి ఆలయం దర్శన ఉంటుంది. రాత్రి హోటల్‌లో బస చేయాల్సి ఉంటుంది. 9వ రోజు ఉదయం 11 గంటలకు మధురైలో రైలు ఎక్కడంతో టూర్ ముగుస్తుంది. ప్యాకేజీలో భాగంగా టిఫిన్, డిన్నర్, ట్రైన్ టికెట్లు, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. ఛార్జీల విషయానికొస్తే..ట్రైన్ క్లాస్, షేరింగ్ ఆధారంగా రూ. 28,200 నుంచి రూ. 72,380 వరకు ఉంది.
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి..