Kerala Tourism: ఈ ప్రాంతాలకు వెళ్తే మిమ్మల్ని మీరు మర్చిపోతారు! ఫుల్ రిఫ్రెష్‌మెంట్ గ్యారంటీ..
కేరళ.. ప్రకృతి వరప్రదాయినిగా పేరుగాంచింది. అక్కడి కాలువలు, పచ్చని చెట్ల అందాలు, కొండలు కోనలు, జలపాతాల సొగసులు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అందుకే మన దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో అది కూడా ఒకటిగా నిలిచింది. కేరళలోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్లను చుట్టు రావాలంటే ఒక్క రోజు సరిపోదు. కానీ మీరు ఒకవేళ మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు ఒకరోజు ప్రశాంతంగా గడిపి రావాలనుకుంటే మాత్రం కేరళలో కొన్ని బెస్ట్ స్పాట్లు ఉన్నాయి. అక్కడికి మీరు వెళ్తే మిమ్మల్ని మరిచిపోవడం ఖాయం. రోజు వారీ ఉద్యోగ టెన్షన్లు, కుటుంబ బరువులు, టార్గెట్ ఒత్తిళ్ల నుంచి మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు ఇవి మీకు ఉపయోగపడతాయి. కేరళలోని అత్యంత సుందర ప్రాంతాలైన వయనాడ్, అలెప్పీ ప్రాంతాలలో ప్రకృతి రమణీయ ప్రదేశాలను మీకు పరిచయం చేస్తున్నాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




