- Telugu News Photo Gallery Cinema photos Heroine Samyuktha menon next movies update and graph as heroine Telugu Actress Photos
Samyuktha Menon: లక్కీ గర్ల్ సడన్‌గా స్లో అయ్యిందేంటి.. ఏం అయ్యింది సంయుక్త.?
ఆ మధ్య వరుస హిట్స్‌తో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఓ బ్యూటీ సడన్‌గా స్లో అయ్యారు. టాలీవుడ్‌లో తొలి సినిమా రిలీజ్ తరువాత వన్ ఇయర్‌లోనే మరో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ... గ్లామర్ కాంపిటీషన్‌లో కాస్త వెనకబడ్డారు. సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు తెలుగువారికి స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ మధ్య వరుస సక్సెస్‌లతో లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో సత్తా చాటారు.
Updated on: Oct 30, 2023 | 12:12 PM

ఆ మధ్య వరుస హిట్స్‌తో లక్కీ గర్ల్ అన్న ట్యాగ్ సొంతం చేసుకున్న ఓ బ్యూటీ సడన్‌గా స్లో అయ్యారు. టాలీవుడ్‌లో తొలి సినిమా రిలీజ్ తరువాత వన్ ఇయర్‌లోనే మరో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ... గ్లామర్ కాంపిటీషన్‌లో కాస్త వెనకబడ్డారు.

సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు తెలుగువారికి స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ మధ్య వరుస సక్సెస్‌లతో లక్కీ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో సత్తా చాటారు.

అదే టైమ్‌లో ఇంట్రస్టింగ్ స్టేట్మెంట్స్‌తో ఆడియన్స్ అటెన్షన్‌ను గ్రాబ్ చేశారు. ఇంకా గోల్డెన్ లెగ్‌లూ, ఐరన్ లెగ్‌లూ ఎంటీ.. జస్ట్ కథని, కేరక్టర్‌నీ చూసి సినిమాలు సైన్ చేస్తాం. హిట్ అయినా, కాకపోయినా అది యూనిట్ మొత్తానికి చెందుతుంది.

ఏ ఒక్కరి ఖాతాలోనో క్రెడిట్ వేస్తానంటే నేను నమ్మను అంటూ హిట్ ఫ్లాప్స్ విషయంలో తన ఓపీనియన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు సంయుక్త. కెరీర్ స్టార్టింగ్‌లోనే నెగెటివ్ రోల్ కూడా చేసి షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ, సడన్‌గా స్లో అయ్యారు.

ఒక్క ఏడాదిలోనే నాలుగు రిలీజ్‌లతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన డెవిల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సంయుక్త.

స్టార్ హీరోల సినిమాల్లో ఆ రేంజ్ హీరోయిన్లనే తీసుకుంటున్నారు. ఇక మీడియం రేంజ్ హీరోలు ఎక్కువగా శ్రీలీల, కృతి శెట్టి వైపే చూస్తుండటంతో సంయుక్తకు ఆఫర్స్ కరువయ్యాయి.

దీనికి తోడు గ్లామర్ రోల్స్‌కు పెద్దగా సూట్ అవ్వరన్న పేరు పడటం కూడా ఈ బ్యూటీ కెరీర్‌కు స్పీడు బ్రేకర్‌లా మారింది ఈ ఇబ్బందులను సంయుక్త ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.




