- Telugu News Photo Gallery Cinema photos Balakrishna and sukumar movie plan rumors in tollywood goes trending Telugu Entertainment Photos
Balakrishna: బాలయ్య నెక్స్ట్ పాన్ ఇండియా డైరెక్టర్ తోనే.. ఫ్యాన్స్ గెట్ రెడీ.
వరుస సక్సెస్‌లతో స్కై హైలో నందమూరి బాలకృష్ణ, ఓ క్రేజీ కాంబోలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్‌తో మూవీకి రెడీ అవుతున్నారట నందమూరి నటసింహం. ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజమేవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్. భగవంత్ కేసరి సక్సెస్‌తో హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి నటసింహా బాలకృష్ణ.
Updated on: Oct 30, 2023 | 1:11 PM

వరుస సక్సెస్‌లతో స్కై హైలో నందమూరి బాలకృష్ణ, ఓ క్రేజీ కాంబోలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్‌తో మూవీకి రెడీ అవుతున్నారట నందమూరి నటసింహం. ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజమేవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

భగవంత్ కేసరి సక్సెస్‌తో హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు నందమూరి నటసింహా బాలకృష్ణ. వరుసగా అఖండ, వీరసింహా రెడ్డి, ఇప్పుడు భగవంత్ కేసరి కూడా వంద కోట్ల మార్క్ రీచ్ అవ్వటంతో బాలయ్మ రేంజ్, మార్కెట్ భారీగా పెరిగింది.

ఈ జోరును ఇలాగే కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు బాలకృష్ణ. ప్రజెంట్ వాల్తేరు వీరయ్య లాంటి బిగ్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ. ఈ సినిమా కూడా బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.

ఆల్రెడీ న్యూ లుక్‌తో మేకోవర్ అయిన నటసింహం త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. నెక్ట్స్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ పుష్ప 2 వర్క్‌లో బిజీగా ఉన్న సుకుమార్, బాలయ్య హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట.

పుష్పతో మాస్ హీరోయిజాన్ని నెక్ట్స్ లెవల్‌లో చూపించిన సుక్కు, బాలయ్య కోసం కూడా ఆ రేంజ్ సబ్జెక్టే రెడీ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి బాలయ్య, సుక్కు కాంబోకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ లేకపోయినా..

ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. సుకుమార్‌తో బాలకృష్ణ సినిమా చేస్తే అది పక్కాగా పాన్ ఇండియా రేంజ్‌లో ఉంటుందని ఆశపడుతున్నారు.




