AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Chip Day: నూనె లేకుండా కరకరలాడే షాప్ స్టైల్ పొటాటో చిప్స్ రెడీ… వీటికి ఓ ప్రత్యేక రోజు ఉందని తెలుసా?

National Potato Chip Day: బయట దొరికే చిప్స్ కరకరలాడుతూ ఉన్నా వాటిని వేయించేందుకు వాడిన నూనె, నిల్వ చేసేందుకు కలిపే ఉప్పు అన్నీ శరీరానికి హానీ చేస్తాయి. కాబట్టి పొటాటో చిప్స్ అత్యంత అనారోగ్యకరమైన ఆహారంగా డాక్టర్లు చెబుతూ ఉంటారు. బంగాళదుంపలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి.

National Chip Day: నూనె లేకుండా కరకరలాడే షాప్ స్టైల్ పొటాటో చిప్స్ రెడీ… వీటికి ఓ ప్రత్యేక రోజు ఉందని తెలుసా?
Potato Chips
Nikhil
|

Updated on: Mar 14, 2023 | 4:10 PM

Share

పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఆహారం పొటాటో చిప్స్. అయితే డాక్టర్లు మాత్రం అత్యంత అనారోగ్యకరమైన ఆహారంగా పొటాటో చిప్స్‌ను చెబుతూ ఉంటారు. ఎందుకంటే బయట దొరికే చిప్స్ కరకరలాడుతూ ఉన్నా వాటిని వేయించేందుకు వాడిన నూనె, నిల్వ చేసేందుకు కలిపే ఉప్పు అన్నీ శరీరానికి హానీ చేస్తాయి. కాబట్టి పొటాటో చిప్స్ అత్యంత అనారోగ్యకరమైన ఆహారంగా డాక్టర్లు చెబుతూ ఉంటారు. బంగాళదుంపలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి జబ్బులకు కారణం అవుతుంది. అలాగే వీటిని వేయించడానికి వాడే నూనె వల్ల ధీర్ఘకాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. మీరు బంగాళాదుంప చిప్స్ ప్రేమికులైతే జాతీయ పొటాటో చిప్స్ డే (మార్చి 14) సందర్భంగా ఇంట్లో చేసేకునేలా ఓ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాం. తక్కువ మసాలా, మంచి నూనె, తక్కువ ఉప్పు, లైట్‌గా మసాలా దినుసులను ఉపయోగించి చేసే తయారీ విధానంపై ఓ లుక్కెయ్యండి. అయితే బరువు తగ్గడానికి, మంచి ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్ మరియు ఇతర పోషకాలు బంగాళదుంపలో తగినంతగా లేనందున వాటిని మితంగా తీసుకోవాలని మాత్రం వైద్య నిపుణులు చెబుతున్నారు. 

బంగాళదుంప చిప్స్ తయారు చేసే విధానం

  • బంగాళాదుంపల తొక్కను జాగ్రత్తగా చెక్కాలి. తర్వాత తొక్కలను పాడేసి వాటిని బాగా కడగాలి. కాగితం లేదా గుడ్డ టవల్‌తో తుడిచి ఆరబెట్టాలి.
  • బంగాళదుంపలను మనకు కావలసిన సైజులో సన్నగా కోయాలి. బంగాళదుంపను ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
  • ఆ ముక్కలపై కొద్దిగా ఆలివ్ నూనెతో టాస్ చేయాలి. ఈ చిప్స్‌ను బేక్ చేస్తాం కాబట్టి నూనె ఎక్కువ వేయకపోయినా పర్లేదు. 
  • బేకింగ్ షీట్లో ముక్కలను పర్చాలి. బంగాళాదుంపలను పొరలుగా వేసేటప్పుడు, వాటి మధ్య ఖాళీ స్థలం ఉండాలి. 
  • ఇప్పుడు ఓవెన్‌ను 200-220 డిగ్రీల వద్ద గ్రిల్‌పై 3 నిమిషాలు ముందుగా వేడి చేయాలి. అనంతరం చిప్స్ పెట్టి మరో పది నిమిషాలు ఉంచాలి. ఆపై ఓవెన్ నుంచి జాగ్రత్తగా తీసివేసి మరో వైపునకు తిప్పాలి. తర్వాత మరో 7-8 నిమిషాలు కాల్చాలి. ఈ సమయంలో అవి మాడిపోకుండా ఉండేలా తరచూ వాటిని గమనించాలి. 
  • ఓవెన్ నుంచి బయటకు తీశాక ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా కారం చల్లి హ్యాపీగా తినవచ్చు.
  • అవసరం అయితే చిప్స్ చల్లారక వాటిని కంటైనర్‌లో వేసి రెండు వారాల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు. 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..