AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flour Storage Tips: డబ్బాలో పెట్టిన పిండికి పురుగులు పట్టేస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఎప్పుడూ ఫ్రెష్‌గానే..

పిండి పదార్థాలను రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం. అందువల్ల ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి డబ్బాల్లో నిల్వ చేస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో వాటికి పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఆ పిండిని శుభ్రం చేసి వాడుకోవాల్సి ఉంటుంది.

Flour Storage Tips: డబ్బాలో పెట్టిన పిండికి పురుగులు పట్టేస్తున్నాయా? ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఎప్పుడూ ఫ్రెష్‌గానే..
Flour
Nikhil
|

Updated on: Mar 14, 2023 | 4:00 PM

Share

వంట గదిలో ఎక్కువగా డబ్బాల్లో పెట్టి నిల్వ చేసుకునేవి ఏంటి? అంటే పిండి పదార్థాలు అని టక్కున చెప్పేస్తాం. గోధుమ పిండి, వరి పిండి, మైదా పిండి, శెనగ పిండి ఎక్కువగా వంట గదిలో నిల్వ చేస్తూ ఉంటాం. ఈ పిండి పదార్థాలను రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం. అందువల్ల ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి డబ్బాల్లో నిల్వ చేస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో వాటికి పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఆ పిండిని శుభ్రం చేసి వాడుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి వాడుకోడానికి కూడా పనికి రాకుండా అయ్యిపోతూ ఉంటుంది. ఉష్ణోగ్రత, తేమలో మార్పులు, కీటకాల పెరుగుదలను సులభతరం చేసే హెచ్చుతగ్గుల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఇది సమస్యాత్మకంగా ఉంటుంది. పిండి చెడిపోకుండా నిరోధించడానికి, దానిని సరిగ్గా నిల్వ చేయడం ముఖ్యం. కాబట్టి పిండిని తాజాగా, కీటకాలు లేకుండా ఉంచడంలో మీకు సహాయపడే కొన్ని సులభమైన చిట్కాలను ఓ సారి తెలుసుకుందాం. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ఆ చిట్కాలేంటో ఓ సారి లుక్కెయ్యండి. 

ఫ్రిడ్జ్‌లో నిల్వ చేయడం

పిండిని నిల్వ చేయడానికి గాజు డబ్బాలో లేదా గాలి చొరబడని ప్లాస్టిక్ కంటైనర్‌లో ఉంచి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం ఉత్తమ మార్గమని పలువురు గృహిణులు చెబతున్నారు. తేమ ప్రవేశించకుండా నిరోధించడానికి మూత గట్టిగా మూసేయాలని మాత్రం గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా చాలా రోజులు పిండిని నిల్వ చేసుకోవడంలో మీకు సహాయంగా ఉంటుంది.

స్టీల్ డబ్బాలో పెట్టడం

తేమ వల్ల పిండి త్వరగా పాడవుతుంది. కాబట్టి పిండిని నిల్వ చేయడానికి స్టీల్ కంటైనర్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. కంటైనర్‌లో పిండిని నింపే ముందు, దానిని కడిగి ఎండలో ఆరబెట్టి తేమను తొలగించాలి.

ఇవి కూడా చదవండి

ఉప్పు కలపడం

పిండిలో 4 నుండి 5 టీస్పూన్ల ఉప్పు కలపడం అనేది కీటకాలు రాకుండా నిరోధించడానికి సులభమైన మార్గం. ఈ చిట్కాను ఉపయోగించడానికి, కంటైనర్‌లో సగం పిండికి రెండు నుంచి మూడు చెంచాల ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత మిగిలిన పిండిని వేసి, ఒకటి లేదా రెండు చెంచాల ఉప్పు వేసి మళ్లీ కలపాలి. ఇది పిండిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.

బిర్యానీ ఆకు వేయడం

పిండిని నిల్వ చేసేటప్పుడు అందులో బిర్యానీ ఆకును జోడించడం కీటకాలను దూరంగా ఉంటాయి. బిర్యానీ ఆకు ఘాటైన వాసన డబ్బాలో కీటకాలను దరి చేరనివ్వదు. అలాగే మనం పిండిని ఉపయోగించినప్పుడు బిర్యానీ ఆకును సులభంగా తొలగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..