గుండె జబ్బులున్న వారి ప్రాణాలు తీస్తోన్న కరోనా
గుండె జబ్బులున్న వారికి కరోనా సోకితో మరణం ముప్పు ఎక్కువని ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. కరోనా బాధితుల్లో చాలా మందికి స్వల్ప అస్వస్థత ఉండగా
Covid 19 patients Heart problems: గుండె జబ్బులున్న వారికి కరోనా సోకితో మరణం ముప్పు ఎక్కువని ఇటలీ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. కరోనా బాధితుల్లో చాలా మందికి స్వల్ప అస్వస్థత ఉండగా.. మిగిలిన వారిలో అది తీవ్ర న్యూమోనియా, మరికొందరికి మరణం సంభవిస్తోంది. దీనిపైన అధ్యయనం చేసిన మ్యాగ్నా గ్రేషియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆసియా, ఐరోపా, అమెరికాలతో కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన 77,317 మందికి సంబంధించిన డేటాను విశ్లేషించారు. వీరిలో 12.89శాతం మందికి ఆసుపత్రిలో చేరే సమయానికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. 36.08 శాతం మందికి అధిక రక్తపోటు, 19.45 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కువ మందిలో గుండె కొట్టుకునే రేటులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. గుండె సమస్యలు లేదా గుండె రుగ్మతలకు దారితీసే అంశాలను బట్టి కోవిడ్- 19 మరణాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
Read More:
నటుడిగా మారిన సంచలన దర్శకుడు.. హీరోయిన్‌గా కీర్తి