గుడ్ న్యూస్ : తెలంగాణలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాల లెవ‌ల్ గ‌ణనీయంగా పెరుగుతోంది.

గుడ్ న్యూస్ :  తెలంగాణలో భారీగా పెరిగిన భూగర్భ జలాలు
Follow us

|

Updated on: Aug 16, 2020 | 8:36 AM

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాల లెవ‌ల్ గ‌ణనీయంగా పెరుగుతోంది. 2019 జులైతో పోలిస్తే ప్రస్తుత జులై వరకు దాదాపు 1800 చ.కి.మీల విస్తీర్ణంలో భూగర్భ జలాలు పెరిగాయని భూగర్భ జలవనరుల శాఖ వెల్ల‌డించింది. కామారెడ్డి, నిజామాబాద్‌, భువనగిరి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నీటిమట్టం పెరుగుదల ఎక్కువ‌గా ఉందని ప్ర‌క‌టించింది.

ఈ ఏడాది వర్షాలు దండిగా కురుస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వాగులు, చెరువులు నింపుతున్నారు. దీంతో భూగర్భ జలమట్టం క్ర‌మీణ‌ పెరుగుతోంది. భూగర్భ జలవనరుల శాఖ విళ్లేష‌ణ ప్ర‌కారం..ఈ సంత్స‌రం జులైలో రాష్ట్రంలో భూగర్భజలాల సగటు లోతు 9.26 మీటర్లు ఉంది. పోయిన సంవ‌త్స‌రం ఇదే నెలలో సగటు 14.12మీటర్లకు పడిపోయింది. అంటే 4.86మీటర్ల మేర భూగర్భ జల మట్టంలో పెరుగుదల ఉందని నిర్దార‌ణ అయ్యింది. గత దశాబ్ద కాలంగా చూసినా యావ‌రేజ్‌గా 2.4 మీటర్ల మేర భూగర్భజలాల్లో పెరుగుదల నమోదైంది. జులై నెల‌లో 158 టీఏంసీల మేర భూగర్భ జలాలు పెరుగుద‌ల ఉంద‌ని, ఈ సీజన్‌లో మొత్తం ఇది 208 టీఎంసీల మేర ఉండొంచ్చ‌ని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ స‌ర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి కంప్లీట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు భూగర్భ జలమట్టం పెరుగుదలలో కీ రోల్ పోషించింద‌ని అధికారులు క‌నుగొన్నారు. 2019 జులైలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు 10 మీ దిగువన 602 చదరపు చ.కి.మీల విస్తీర్ణంలో ఉండగా.. 2020 జులై నాటికి ఆ విస్తీర్ణం 2,419 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.

Also Read : విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…స‌హాయం కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్లు