ఆహార పదార్ధాలతో కరోనా వ్యాపించదు.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన..
బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్ వింగ్స్‌తో పాటు ఆహార ప్యాకేజీలలో తాము కరోనా వైరస్‌ను గుర్తించినట్లు చైనా అధికారులు వెల్లడించడంతో.. ఒక్కసారిగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Spread Of COVID-19 In Food: బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న చికెన్ వింగ్స్‌తో పాటు ఆహార ప్యాకేజీలలో తాము కరోనా వైరస్‌ను గుర్తించినట్లు చైనా అధికారులు వెల్లడించడంతో.. ఒక్కసారిగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆహారం లేదా ఆహార ప్యాకేజీలతో కరోనా వ్యాప్తిస్తుందేమోనని భయపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.
ఆహారం లేదా ఆహార ప్యాకేజీలతో కరోనా వ్యాపించదని.. ఇప్పటివరకు ఇలా వైరస్ సోకినట్లు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఆహారం, ఫుడ్ ప్యాకేజింగ్ లేదా ఆహార పదార్ధాలు కొనుగోలు చేసే విషయంలో భయపడకూడదని” ప్రజలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మైక్ ర్యాన్ తెలిపారు. చైనాలో జరిగిన పరిశోధనా ఫలితాలు ఆధారంగా ఈ విషయాలు తెలిసినట్లు ఆయన అన్నారు. కొన్ని లక్షల ఆహార పదార్ధాలు, ప్యాకేజింగ్‌లపై కరోనా పరీక్ష నిర్వహించారని.. అతి తక్కువ ప్యాకేజింగ్‌లపైనే కరోనాను గుర్తించినట్లు చెప్పారు. దీనితో ప్రజలు ఆహారం విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి మైక్ ర్యాన్ స్పష్టం చేశారు.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి హెల్ప్‌లైన్..
జేఎన్టీయూ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.!
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..
కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!