ఆధార్ నంబర్‌తో తక్షణ ఇ-పాస్: సీఎం

ఆధార్ నంబర్‌తో తక్షణ ఇ-పాస్: సీఎం

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 6:51 PM

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆగస్టు 17 నుంచి తక్షణ తమిళనాడు ఇ-పాస్ కోసం ఆధార్ నంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆధార్ లేదా రేషన్ కార్డు వివరాలను అందించడం ద్వారా ఇ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఆగస్టు 17 నుంచి తమ ఇ-పాసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లభిస్తాయని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి శుక్రవారం ప్రకటించారు.

తమిళనాడు రాష్ట్రంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కాగా.. ప్రజల సంక్షేమం కోసం ఇ-పాస్ వ్యవస్థను సులభతరం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నందున, అనివార్యమైన కారణాల వల్ల మాత్రమే ఇ-పాసులు దరఖాస్తు చేసుకోవాలని పళనిస్వామి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజల ప్రయోజనాల కోసం కోవిడ్ -19 లాక్‌డౌన్ పరిమితుల నుంచి సడలింపులు మంజూరు చేస్తున్నామని సీఎం చెప్పారు.

Read More:

అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!

సౌండ్ పొల్యూషన్ నిబంధనలు అతిక్రమిస్తే.. రూ.లక్ష జరిమానా..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu