కరోనాపై పోరాటానికి 100 బిలియన్ డాలర్ల ఖర్చు తప్పదు
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ అన్నారు.
WHO on Coronavirus: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. ఈ వైరస్‌తో పోరాటానికి కొత్త సాధనాలను(వ్యాక్సిన్) తయారు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. వాటి కోసం భారీ ఖర్చు కూడా అవుతుందని తెలిపారు. గురువారం కరోనా పరిస్థితులపై మాట్లాడిన ఆయన.. ప్రపంచవ్యాప్తంగా 20.69 మిలియన్ల మంది ఈ వైరస్ బారిన పడ్డారని అన్నారు. వారిలో ఏడున్నర్ర లక్షలకు పైగా మరణించారని పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్ జాతీయతకు సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పోటీ, డిమాండ్ ఏర్పడిందని.. తద్వారా ధరలు పెరిగి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 170 వ్యాక్సిన్‌లు తయారీలో ఉండగా.. వాటిలో క్లినికల్ ట్రయల్స్‌లో 26 మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.
Read More:
అమ్మోనియం నైట్రేట్ వల్ల ఏపీకి ముప్పు లేదు: డీజీపీ