ఈనెల 19 నుంచి హైదరాబాద్-ఔరంగాబాద్ విమాన సర్వీసులు

ఈనెల 19 నుంచి హైదరాబాద్-ఔరంగాబాద్ విమాన సర్వీసులు

కరోనా ప్రభావంతో స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ మెల్లమెల్లగా మొదలవుతోంది. త్వరలో దేశీయ విమానయాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ

Balaraju Goud

|

Aug 14, 2020 | 7:06 PM

కరోనా ప్రభావంతో స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ మెల్లమెల్లగా మొదలవుతోంది. త్వరలో దేశీయ విమానయాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ నెల 19 నుంచి హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో సిద్ధమైంది. ఈ మేరకు సిటీ ఎయిర్ పోర్టు డీజీ సాల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలాఖరు నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది. మే నెలాఖరులో కేంద్ర సడలింపులు ఇవ్వడంతో ఇండిగో పాక్షికంగా తిరిగి సర్వీసులను పునరుద్ధరించింది. జూన్ 19 నుంచి వారానికి మూడుసార్లు న్యూఢిల్లీ-ఔరంగాబాద్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభించినట్టు సాల్వే తెలిపారు. అలాగే, మరో విమానయాన సంస్థ గత నెలలో హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య వారానికి నాలుగుసార్లు విమాన సర్వీసులు నడిపినట్లు వెల్లడించారు. వారంలో రెండుసార్లు న్యూఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానాన్ని నడుపుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 19 నుంచి హైదరాబాద్-ఔరంగాబాద్-హైదరాబాద్ మధ్య ఇండిగో ప్రతి రోజూ విమానాలు నడపనున్నట్టు సాల్వే తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu