ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీ రేటు..

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,73,085కు చేరింది. ఇందులో 89,907 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,80,703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 97 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2475కు […]

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన రికవరీ రేటు..
Follow us

|

Updated on: Aug 14, 2020 | 6:14 PM

Coronavirus Positive Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,943 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,73,085కు చేరింది. ఇందులో 89,907 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,80,703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 97 మంది మరణించగా.. మృతుల సంఖ్య 2475కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో 9,779 మంది కరోనాను జయించారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 762, చిత్తూరులో 987, తూర్పు గోదావరిలో 1146, గుంటూరులో 527, కడపలో 530, కృష్ణాలో 338, కర్నూలులో 956, నెల్లూరులో 669, ప్రకాశంలో 300, శ్రీకాకుళంలో 547, విశాఖలో 885, విజయనగరంలో 548, పశ్చిమ గోదావరిలో 748 కేసులు నమోదయ్యాయి. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2461, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 434 కేసులు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో గత మూడు రోజులుగా 25,977 మంది కరోనాను జయించి ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి హెల్ప్‌లైన్‌..

జేఎన్టీయూ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..