అమ్మోనియం నైట్రేట్ వల్ల ఏపీకి ముప్పు లేదు: డీజీపీ
అమ్మోనియం నైట్రేట్ వలన ఏపీకి ఎలాంటి ముప్పు లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇటీవల లెబనాన్‌లోని బీరూట్‌లో అమ్మోనియం నైట్రేట్ పేలుడు అవ్వడంతో
Ammonium Nitrate Stockpiles AP: అమ్మోనియం నైట్రేట్ వలన ఏపీకి ఎలాంటి ముప్పు లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఇటీవల లెబనాన్‌లోని బీరూట్‌లో అమ్మోనియం నైట్రేట్ పేలుడు అవ్వడంతో వందల సంఖ్యలో మృతి చెందగా, పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చెన్నైలోని మనాలీలో ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలను పలు ప్రాంతాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీరూట్ ఘటన నేపథ్యంలో ఏపీలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వాడకం, వినియోగంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వినియోగం, విక్రయాలపై 2012 లో రూపొందించిన నిబంధనలను జిల్లాల ఎస్పీలకు వివరించారు.
ఈ సందర్భంగా అమ్మోనియం నైట్రేట్ వినియోగంపై ఖచ్చితంగా నిబంధనలు అమలుచేయాలని ఆదేశించారు. వీటిని అతిక్రమించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడొద్దని సూచించారు. లైసెన్సు లేకుండా అమ్మోనియం నైట్రేట్ తయారీకి అనుమతి లేదని అలాగే అనుమతి లేకుండా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించకూడదని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. లైసెన్స్ కలిగిన గిడ్డంగులలో మాత్రమే అమ్మోనియం నైట్రేట్‌ని నిల్వ ఉంచాలని.. నిబంధనలకు లోబడి ఎగుమతులు/దిగుమతులు నిర్వహించాలని తెలిపారు. అంతేకాదు ఎంపిక చేసిన లైసెన్స్ కలిగిన వారికి మాత్రమే దీన్ని సరఫరా చేయాలని పేర్కొన్నారు. ఇక పేలుడు పదార్ధాలతో కలిపి అమ్మోనియం నైట్రేట్‌ని రవాణా చేయరాదని, కొనుగోలు చేసిన అమ్మోనియం నైట్రేట్‌కి అదనంగా రవాణాకు అనుమతి లేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే వీటి నిల్వలకు 18 ఏళ్ల లోపు ఉన్నవారిని, అంగవైకల్యం, అనారోగ్య సమస్యలతో ఉన్నవారిని ఉద్యోగులుగా నియమించకూడదని హెచ్చరించారు. అమ్మోనియం నైట్రేట్ ప్యాకింగ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని గౌతమ్ సవాంగ్ తెలిపారు.
Read More: