ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గం ఈ నెల 19వ తేదీన స‌మావేశం కానుంది. సీఎం జ‌గన్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విప‌రీతంగా విస్త‌రిస్తున్న‌ నేప‌థ్యంలో ఈ కేబినెట్ భేటీ కీల‌కం కానుంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ భేటీలో..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 2:26 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రివ‌ర్గం ఈ నెల 19వ తేదీన స‌మావేశం కానుంది. సీఎం జ‌గన్ అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విప‌రీతంగా విస్త‌రిస్తున్న‌ నేప‌థ్యంలో ఈ కేబినెట్ భేటీ కీల‌కం కానుంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే ఈ భేటీలో ప‌లు కీల‌కాంశాల‌పై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. స‌మావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చర్చించ‌నున్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై క‌మిటీ వేయ‌డంతో ఈ అంశంపై ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మ‌రోవైపు రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై కూడా ప్ర‌ధానంగా కేబినెట్ మీటింగ్‌లో చ‌ర్చించ‌బోతున్నార‌ని స‌మాచారం.

కాగా ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి తీవ్రంగా పెర‌గ‌డంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి స‌మయంలో ప్ర‌భుత్వం ఈ కేబినెట్ మీటింగ్‌లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోబోతుందో కీల‌కంగా మార‌నుంది. మ‌రోవైపు పాఠ‌శాల‌లు, కాలేజీలు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? ఇళ్ల ప‌ట్టాల పంపిణీ ఎప్పుడు పంపిణీ చేయాలి? అనే వాటిపై కూడా ఒక‌ స్ప‌ష్ట‌త‌కు రానున్న‌ట్టు స‌మాచారం.

Read More:

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu