గుంటూరులోని రేపల్లెలో సంపూర్ణ లాక్‌డౌన్‌

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌లు ప‌రుస్తోంది ఏపీ ప్ర‌భుత్వం. అందులోనూ గుంటూరు జిల్లాలో మొదటి నుంచీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య..

  • Tv9 Telugu
  • Publish Date - 2:03 pm, Fri, 14 August 20
గుంటూరులోని రేపల్లెలో సంపూర్ణ లాక్‌డౌన్‌

Complete lockdown at Repalle: ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌లు ప‌రుస్తోంది ఏపీ ప్ర‌భుత్వం. అందులోనూ గుంటూరు జిల్లాలో మొదటి నుంచీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే న‌మోద‌వుతున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ రేప‌ల్లె మాత్రం గ్రీన్ జోన్‌గా ఉంది. కానీ ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. రేప‌ల్లెలో కూడా కేసుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో.. ఇక్క‌డ కూడా ఈ నెల 16వ తేదీ నుంచి రేప‌ల్లెలో సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు ప‌రుస్తున్నారు అధికారులు. ఉద‌యం 6 గంటల నుండి 9 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే వ్యాపారుల‌కు మిన‌హాయింపు ఉంటుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. కాగా కరోనా కాలంలో గ్రీన్ జోన్‌గా ఉన్న రేప‌ల్లె.. ప్ర‌స్తుతం మ‌రోసారి లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తోంది.

Also Read:

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు

ప్ర‌పంచంలో ఉన్న‌ ప్రేమ‌నంతా త‌న‌పై కురిపించుః నాగ‌బాబు