Cough Relief Tips: గుడ్డు ఇలా తింటే.. జలుబు, దగ్గు నయమవుతుందా? ఇందులో నిజమెంత..
గుడ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు లభిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. గుడ్డు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ దండిగా ఉంటుంది. పచ్చసొనలోనూ ప్రోటీన్‌తోపాటు కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. గుడ్డులోని ఈ పోషకాలు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయని చాలా మంది భావిస్తుంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

గుడ్డును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అందుకే గుడ్లను సూపర్‌ఫుడ్ అంటారు. ఇవి రుచితో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. గుడ్డులోని తెల్ల భాగం, పచ్చసొనతో కలిపి మొత్తం గుడ్డు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుడ్డులోని తెల్ల భాగంలో ప్రోటీన్ ఉంటుంది. ఇక పచ్చసొనలో ప్రోటీన్‌తోపాటు కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. గుడ్డులోని ఈ పోషకాలు దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయని చాలా మంది భావిస్తుంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..
గుడ్లు దగ్గు, జలుబు నుండి ఉపశమనం పొందడంలో ప్రత్యక్షంగా సహాయపడకపోయినా ఇవి పరోక్షంగా కూడా సహాయపడతాయి. గుడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని పోషకాలు దగ్గును త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి. గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల అవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఇవి దగ్గు, జలుబుకు వ్యతిరేకంగా పోరాడటానికి శరీరానికి సహాయపడతాయి. గుడ్లలో విటమిన్ డి, బి12 లతో పాటు శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి. గుడ్డులోని పోషకాలు శరీరాన్ని సహజంగా రక్షించడంలో కూడా సహాయపడతాయి. అందువల్ల మీకు అధిక దగ్గు లేదా జలుబు ఉన్నప్పుడు గుడ్లు తినడం సురక్షితమని నిపుణులు అంటున్నారు.
గుడ్లు తినేటప్పుడు గొంతును తేమగా ఉంచడానికి, దగ్గు వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి పుష్కలంగా నీళ్లు తాగాలి. దీనితోపాటు పసుపు, తేనె, నిమ్మకాయతో వెచ్చని పాలు లేదా తులసి, తేనె మిశ్రమం తాగడం వల్ల దగ్గు నుంచి మరింత ఉపశమనం లభిస్తుంది. దగ్గు తీవ్రంగా ఉంటే లేదా మీకు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించడం, ఇతర తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రాథమికమైనది. వివరణాత్మక సమాచారం కోసం ఏదైనా ప్రయోగం చేసే ముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




