AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి రాగి సీసా లేదా మట్టి కుండ.. ఏ పాత్రలో నీరు ఆరోగ్యకరమో తెలుసా..!

పూర్వ కాలంలో నీటిని నిల్వ చేయడానికి మట్టి కుండలు లేదా రాగి-ఇత్తడి పాత్రలు ఉపయోగించేవారు. ప్రజలు వంట చేయడానికి మట్టి పాత్రలు ఉపయోగించేవారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇవన్నీ మధుర జ్ఞాపకాలుగా మిలిపోయాయి. ప్రస్తుతం వేసవి వచ్చిందంటే చాలు ప్రజల ఇళ్లల్లో కాకపోయినా.. రోడ్ల కూడలిలో లేదా ఇతర ప్రాంతాల్లో బాటశారుల దాహార్తిని తీర్చడానికి కుండల్లో నీళ్లను పెట్టి అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు మట్టి లేదా రాగి పాత్రలో ఉంచిన నీరు ఏది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందో లేదో తెలుసుకుందాం.

వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి రాగి సీసా లేదా మట్టి కుండ.. ఏ పాత్రలో నీరు ఆరోగ్యకరమో తెలుసా..!
Copper Bottle Vs Earthen Bo
Surya Kala
|

Updated on: Apr 30, 2024 | 9:12 AM

Share

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఫ్రిజ్‌లోని చల్లటి నీళ్లను తాగుతారు. అయితే కాలంలో వచ్చిన మార్పులతో మళ్ళీ ఆ పాత మధురం అంటూ ప్రిడ్జిలు వద్దు కుండలు ముద్దు అంటూ కుండలో నీరుని తాగడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అవును రిఫ్రిజిరేటర్ లో పెట్టిన చల్లని నీటి కంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీరే ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అంతేకాదు ఆరోగ్యంగా ఉండటానికి రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం రాగి బాటిళ్లలో నీళ్లు తాగే ట్రెండ్ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. వేసవి లో మట్టి కుండలో ఉంచిన నీరు మరింత ప్రయోజనకరంగా ఉంటుందా లేదా రాగి పాత్రలో ఉంచిన నీరు ఎక్కువ ప్రయోజనాలను పొందుతుందా అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంది కూడా.. ఈ నేపధ్యంలో ఈ రోజు వేసవిలో మట్టి కుండ నీరు శ్రేష్టగా లేక రాగి పాత్రలో నీరు శ్రేష్టమా తెలుసుకుందాం..

పూర్వ కాలంలో నీటిని నిల్వ చేయడానికి మట్టి కుండలు లేదా రాగి-ఇత్తడి పాత్రలు ఉపయోగించేవారు. ప్రజలు వంట చేయడానికి మట్టి పాత్రలు ఉపయోగించేవారు. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇవన్నీ మధుర జ్ఞాపకాలుగా మిలిపోయాయి. ప్రస్తుతం వేసవి వచ్చిందంటే చాలు ప్రజల ఇళ్లల్లో కాకపోయినా.. రోడ్ల కూడలిలో లేదా ఇతర ప్రాంతాల్లో బాటశారుల దాహార్తిని తీర్చడానికి కుండల్లో నీళ్లను పెట్టి అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు మట్టి లేదా రాగి పాత్రలో ఉంచిన నీరు ఏది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందో లేదో తెలుసుకుందాం.

కుండలో నిల్వ చేసిన త్రాగునీరు

మట్టి పాత్రలను స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. ఆయుర్వేదంలో కూడా మట్టి పాత్రలో ఉంచిన నీరు మంచిదని భావిస్తారు. ఎందుకంటే మట్టి, నీరు, అగ్ని మొదలైన వాటిని కుండ లేదా కుజాను సిద్ధం చేయడానికి ఉపయోగిస్తారు. వేసవిలో కుండలో నీరు చల్లదనాన్ని అందించడమే కాదు పిత్త సమతుల్యతను కాపాడడానికి కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

కుండ నీరు ప్రయోజనాలు

మట్టి కుండలో ఉంచిన నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు హాని జరగదు. చల్లదనాన్ని అందిస్తుంది. ఎండ వేడి నుంచి ఉపశమనం తో పాటు వడ దెబ్బ తగిలే అవకాశాలను తగ్గిస్తుంది. మట్టి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు కూడా లభిస్తాయి. అయితే మట్టి కుండలో నిల్వ ఉంచిన నీటిని తాగితే పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

రాగి పాత్రలో ఉంచిన నీరు

రాగి పాత్రలో ఉంచిన నీరు ఆరోగ్య పరంగా కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందుకోసం రాగి పాత్రలో 6 నుంచి 7 గంటల పాటు నీటిని నిల్వ చేసి తర్వాత తాగవచ్చు లేదా రాత్రి సమయంలో రాగి పాత్రలో ఉంచిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో సేవించవచ్చు. కడుపు సమస్యల నుంచి ఉపశమనం అందించడమే కాకుండా, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తిని పెంచడం మొదలైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల నష్టాలు

రాగి పాత్రలో ఉంచిన నీరు మీకు అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికి.. రాగి పాత్రలోని నీరుని అధికంగా తీసుకుంటే కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. శరీరంలో రాగి సాంద్రత ఎక్కువ అయితే వికారం, విరేచనాలు, కాలేయం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. కనుక రోజూ రాగి సీసాలలో నీరు త్రాగే వారు ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలి. అంతే కాకుండా రాగి పాత్రలో ఉంచిన నీటిలో నిమ్మకాయను కలపకూడదని కూడా గుర్తుంచుకోవాలి. కుండ, రాగి ఇలా రెండు పాత్రలలో ఉంచిన నీరు ఆరోగ్య పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే రాగి పాత్రలో నీరు త్రాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం)