Uttar Pradesh: వారణాసిలో టాటూలతో HIV వ్యాప్తి.. 26 మంది యువకులకు పాజిటివ్‌గా గుర్తింపు
పూర్వాంచల్‌లోని అజంగఢ్, మీర్జాపూర్ , వారణాసి డివిజన్‌లలోని పది జిల్లాల్లో 26,890 మంది హెచ్‌ఐవి సోకిన వారు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది వయస్సు 20 నుంచి 45 ఏళ్ల మధ్యే. టాటూలు వేయించుకున్న 40 మందికి వ్యాధి సోకిందని అనుమానిస్తున్నారు. పచ్చబొట్టు వేయించుకోవడంతో వారణాసిలో 26 మందికి హెచ్‌ఐవీ సోకిందని చెబుతున్నారు. ఈ 26 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తుల కేస్ స్టడీ ఆధారంగా తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారణాసిలోని ఏఆర్‌టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రీతి అగర్వాల్ తెలిపారు.
కాలం తెచ్చిన మార్పుల్లో ఒకటి శరీరంపై టాటూలు. టాటూలు వేయించుకోవడానికి యువత విపరీతమైన ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో టాటూలు వేయించుకున్న 26 మందికి హెచ్‌ఐవీ సోకినట్లు అనుమానిస్తున్నారు. కేస్ స్టడీ , గత చరిత్ర ఆధారంగా టాటూ వేయించుకున్న వ్యక్తులకు HIV సంక్రమణ జరిగే అవకాశం ఉంది. ఒకే సూదితో పదే పదే టాటూలు వేయించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా చౌక దుకాణాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో టాటూలు వేయించుకోవద్దని వైద్యుల బృందం సూచించింది.
పూర్వాంచల్‌లోని అజంగఢ్, మీర్జాపూర్ , వారణాసి డివిజన్‌లలోని పది జిల్లాల్లో 26,890 మంది హెచ్‌ఐవి సోకిన వారు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది వయస్సు 20 నుంచి 45 ఏళ్ల మధ్యే. టాటూలు వేయించుకున్న 40 మందికి వ్యాధి సోకిందని అనుమానిస్తున్నారు.
టాటూ తర్వాత HIV ఇన్ఫెక్షన్
పచ్చబొట్టు వేయించుకోవడంతో వారణాసిలో 26 మందికి హెచ్‌ఐవీ సోకిందని చెబుతున్నారు. ఈ 26 మంది హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తుల కేస్ స్టడీ ఆధారంగా తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారణాసిలోని ఏఆర్‌టీ సెంటర్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రీతి అగర్వాల్ తెలిపారు.
ఈ 26 మంది శరీరాలపై టాటూలు
అసురక్షిత శృంగారం, ఇన్ఫెక్షన్ సోకిన రక్తాన్ని ఎక్కించడం, ఒకే సూది లేదా సిరంజి నుంచి మందులు తీసుకోవడం.. ఈ మూడు ప్రధాన కారణాలతో హెచ్‌ఐవీ ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా సోకుతుందని వైద్య అధికారి చెప్పారు. హెచ్‌ఐవీ బాధితురాలైన ఈ 26 మందికి ఇచ్చిన కౌన్సెలింగ్‌లో తాము ఈ 3 కారణాలను దృష్టిలో పెట్టుకుని సురక్షితంగా ఉన్నామని చెప్పారు. దీంతో డాక్టర్ దృష్టి బాధితుల శరీరంపై ఉన్న టాటూలపైకి పడింది. ఈ 26 మంది శరీరాలపై టాటూలు వేయించుకున్నారు.
సూదిని పదేపదే వాడటం వల్ల హెచ్‌ఐవి
వైద్యుల అభిప్రాయం ప్రకారం టాటూని వేసే కళాకారులూ ఉపయోగిస్తున్న సూదులు విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. టాటూ వేయడానికి ఉపయోగించే సూది సూది ధర రూ.1200. ఇదిలావుండగా కూడళ్లలో రూ.200లకు పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. అంటే టాటూలతో తమ ఆరోగ్యంతో తామే ఆటలు ఆడుకుంటున్నారు. సూదిని పదేపదే ఉపయోగించడం కూడా ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణం.
10 జిల్లాల్లో పెరిగిన హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య
ఆరోగ్య శాఖలు ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ART కేంద్రాలను నిర్వహిస్తాయి. ఇక్కడ HIV సోకిన వ్యక్తుల వివరాలు నమోదు చేయబడతాయి. ఆపై అవసరమైన పరీక్షలు, చికిత్స ఏర్పాటు చేస్తారు. 10 జిల్లాల ఏఆర్‌టీ కేంద్రాల్లో సోకిన వారి సంఖ్య పెరిగినట్లు వెల్లడైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..