AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalashtami Puja: కాలాష్టమి రోజున ఈ సులభమైన పరిహారాలు చేయండి.. శివయ్య అనుగ్రహం పొందండి..

కాలాష్టమి రోజున శివునితో పాటు అతని రూపమైన కాల భైరవుడిని సరైన పద్ధతిలో పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని, జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకం. కాల భైరవుడిని ఆరాధించడం ద్వారా మంత్ర, తంత్రం విద్యను పొందుతారని నమ్మకం. ఈ మంత్రం, తంత్రాల కోసం కాల భైరవుడిని నిశిత ముహూర్తంలో పూజిస్తారు. చైత్ర మాసంలోని కాలాష్టమి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలో, ఈ రోజున పూజించే శుభ సమయం, ఉపవాసం, పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం

Kalashtami Puja: కాలాష్టమి రోజున ఈ సులభమైన పరిహారాలు చేయండి.. శివయ్య అనుగ్రహం పొందండి..
Kalashtami Puja
Surya Kala
|

Updated on: Apr 30, 2024 | 6:37 AM

Share

కాలాష్టమి ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. పురాణ నమ్మకాల ప్రకారం కాలాష్టమిని భైరవష్టమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ కాలం భైరవుడికి అంకితం చేయబడింది. కాల భైరవుడని భైరవనాథ్ అని కూడా పిలుస్తారు. కాల భైరవుడు శివుని ఉగ్ర రూపంగా పరిగణించబడతాడు. అంతేకాదు అతను శివుని ఐదవ అవతారంగా కూడా పరిగణించబడతాడు. అందుకే ఈ రోజున శివుడు, అతని రూపమైన కాల భైరవుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రత్యేక పూజలు చేస్తారు.

కాలాష్టమి రోజున శివునితో పాటు అతని రూపమైన కాల భైరవుడిని సరైన పద్ధతిలో పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని, జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారని నమ్మకం. కాల భైరవుడిని ఆరాధించడం ద్వారా మంత్ర, తంత్రం విద్యను పొందుతారని నమ్మకం. ఈ మంత్రం, తంత్రాల కోసం కాల భైరవుడిని నిశిత ముహూర్తంలో పూజిస్తారు. చైత్ర మాసంలోని కాలాష్టమి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలో, ఈ రోజున పూజించే శుభ సమయం, ఉపవాసం, పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం?

నెల కాలాష్టమి 2024 ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి 1 మే 2024 బుధవారం ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే మే 2వ తేదీ ఉదయం 4:01 గంటలకు ముగుస్తుంది. నెలవారీ కాలాష్టమి బుధవారం, మే 1న జరుపుకుంటారు. ప్రదోషకాల సమయంలో ఈ రోజున పూజించడం అత్యంత పవిత్రమైన సమయం.

ఇవి కూడా చదవండి

కాలాష్టమి రోజున ఈ పరిహారాలు చేయండి

కాలాష్టమి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రపరచి, నిత్యకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి, ఉదయం పూజ సమయంలో ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో దీపం, ధూపం వెలిగించి భైరవుడిని పూజించాలి. ఈ రోజున శివునితో పాటు మొత్తం శివ కుటుంబాన్ని కూడా పూజించాలి. హారతి ఇచ్చి పూజను ముగించండి. ఇప్పుడు దేవునికి ఆహారం సమర్పించి, పూజలో తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని దేవుడిని ప్రార్థించండి. దీని తరువాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం ప్రారంభించండి. ఉపవాస సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు