- Telugu News Photo Gallery Do you know if you use salt to main door removes negativity, check here is details in Telugu
Vastu Tips: ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పును కడితే ఏం జరుగుతుందో తెలుసా?
వాస్తు ప్రకారం ఉప్పుకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించి.. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టవచ్చు. అదే విధంగా పూర్వం నుంచి ఉప్పును లక్ష్మీ దేవితో పోల్చుతారు. అందుకే ఉప్పుకు కాలు తగలకూడదని, చేతితో మరొకరికి ఇవ్వకూడదనిపెద్దలు అంటూ ఉంటారు. ఉప్పుతో ఇంటిని తుడవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. ఉప్పుకు సంబంధించి ఇప్పటికే చాలా రకాల చిట్కాలు..
Updated on: Apr 29, 2024 | 3:15 PM

వాస్తు ప్రకారం ఉప్పుకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించి.. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టవచ్చు. అదే విధంగా పూర్వం నుంచి ఉప్పును లక్ష్మీ దేవితో పోల్చుతారు. అందుకే ఉప్పుకు కాలు తగలకూడదని, చేతితో మరొకరికి ఇవ్వకూడదనిపెద్దలు అంటూ ఉంటారు.

ఉప్పుతో ఇంటిని తుడవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు. ఉప్పుకు సంబంధించి ఇప్పటికే చాలా రకాల చిట్కాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాస్తు ప్రకారం ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.

ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది.

అంతే కాకుండా వైవాహిక సమస్యలు ఏమైనా ఉన్నా తొలగుతాయి. అదే విధంగా ఇంటి యజమాని జాతకంలో ఉండే శుక్ర దోషాలు పోతాయి. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయట పడతారు.

ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల.. అప్పుల నుంచి బయట పడి.. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలు నెలకొంటాయి. తగాదాలు వంటివి ఏర్పడకుంటా ఉంటాయి.




