PM Modi: పండ్లు అమ్ముకునే మహిళను కలిసిన ప్రధాని మోదీ.. ఎందుకంటే.?

PM Modi: పండ్లు అమ్ముకునే మహిళను కలిసిన ప్రధాని మోదీ.. ఎందుకంటే.?

Anil kumar poka

|

Updated on: Apr 30, 2024 | 9:21 AM

స్వచ్ఛభారత్‌ ఉద్యమానికి అంకురార్పణ చేసి, చైతన్యం తీసుకువస్తున్న ప్రధాని మోదీ, ఒక సామాన్యురాలిని అభినందించారు. ఎవరూ చెప్పకున్నా, స్వచ్ఛభారత్‌లో ఆ మహిళ తన వంతు కృషి చేస్తుండటంతో మోదీ ఫిదా అయ్యారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రధాని మోదీ, ఓ పండ్లు అమ్ముకునే మహిళను కలిశారు. ఆమె చేస్తున్న పని ఎంతోమందికి స్పూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించారు.

మోహినీ గౌడ అనే మహిళ కర్నాటకలోని అంకోలా బస్టాండ్‌లో ఫ్రూట్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. తన కస్టమర్లకు అమ్మే పండ్లను ఆమె ప్లాస్టిక్ కవర్లలో కాకుండా ఆకులలో చుట్టి ఇస్తోంది. అలా ఆమె దగ్గర పండ్లు కొన్నవారు వాటిని తిన్న తర్వాత ఆకులను అలాగే బస్టాండ్‌లో ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. అది గమనించిన ఆమె- వాటిని సేకరించి తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తుంది. అది ఆమె పని కాకపోయినా, ఆమె ఒక సామాజిక బాధ్యతగా భావించి ఆకులను సేకరించి చెత్తబుట్టలో వేస్తూ స్వచ్ఛ భారత్‌కు స్పూర్తిగా నిలిచింది. ఈ మహిళను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మెచ్చుకోగా, ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీ ఆమెను కలిసి స్వయంగా అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.