AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat Waves: ఏప్రిల్‌లో ఉష్ణోగ్రత 100 ఏళ్ల రికార్డు బద్దలు.. మేలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి

ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఈ రెండు నెలలు ఇతర సంవత్సరాల కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ శాఖ గతంలో కూడా చెప్పింది. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో వాతావరణ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు రెండు దశల్లో జరిగిన ఓటింగ్‌లో ఉష్ణోగ్రతలు, వడగాల్పుల కారణంగా చాలా చోట్ల ఓటింగ్‌పై ప్రభావం పడింది.

Heat Waves: ఏప్రిల్‌లో ఉష్ణోగ్రత 100 ఏళ్ల రికార్డు బద్దలు.. మేలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి
Heaat Waves
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2024 | 8:06 AM

ఏడాది ఏడాదికి ఎండ వేడిమి, వేడి గాలుల తీవ్రత పెరిగిపోతోంది. ఉక్కబోతతో జనం అల్లాడిపోతున్నారు. ఒకలాంటి విచిత్ర వాతావరణం ఏప్రిల్ నెలలో కనిపించింది. ఈ నెలలలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 103 సంవత్సరాల తర్వాత అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. చాలా చోట్ల ఉష్ణోగ్రత వేడి 43 డిగ్రీలకు చేరుకుంది. అంతేకాదు తాజాగా మే నెలలో వాతావరణం ఎలా ఉంటుందో వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది.

వాతావరణ శాఖ ఏప్రిల్ నెలలో 1921-2024 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు ఉన్న డేటాను పంచుకుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏప్రిల్ నెల అత్యంత వేడి నెలగా ఉంన్నదని ఈ డేటా చూపుతోంది. ఇక మరో ఐదు రోజుల్లో ఇది మరింత వేడిగా మారనుంది. IMD ప్రకారం దేశంలోని తూర్పు, దక్షిణ ద్వీపకల్పంలో తీవ్రమైన వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది.

మరో ఐదు రోజుల్లో విపరీతమైన వేడి

ఈ తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు రాబోయే ఐదు రోజుల పాటు కొనసాగునున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ సమయంలో ఓటింగ్ జరగాల్సిన చోట్ల వేడి ఎక్కువగా ఉంటుంది. బెంగాల్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో పాటు కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

వేడి ఓటింగ్‌పై కూడా ప్రభావం

ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఈ రెండు నెలలు ఇతర సంవత్సరాల కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండవచ్చని వాతావరణ శాఖ గతంలో కూడా చెప్పింది. ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో వాతావరణ శాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు రెండు దశల్లో జరిగిన ఓటింగ్‌లో ఉష్ణోగ్రతలు, వడగాల్పుల కారణంగా చాలా చోట్ల ఓటింగ్‌పై ప్రభావం పడింది.

రెండో దశ ఓటింగ్ తర్వాత కొన్ని రాష్ట్రాల అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. డేటా ప్రకారం, హీట్‌వేవ్ ఇండెక్స్ 40 నుండి 50 డిగ్రీల సెల్సియస్ వరకు కనిపిస్తుంది. కేరళ సహా తూర్పు తీరంలోని పలు ప్రాంతాల్లో ఈ సూచీ 50 నుంచి 60 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది.

రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రత 1-2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. వచ్చే 4-5 రోజుల్లో మధ్య భారతంలో గరిష్ట ఉష్ణోగ్రత 2-4 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు. మరో 3-4 రోజుల్లో తమిళనాడులో గరిష్ట ఉష్ణోగ్రత 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది.

ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు:

ఇంట్లోనే ఉండండి, కిటికీలు, తలుపులు మూసి ఉంచండి. వీలైనంత వరకు ప్రయాణం మానుకోండి. కాంక్రీట్ నేలపై పడుకోవద్దు. కాంక్రీట్ గోడలకు అనుకుని కుర్చుకోవద్దు. ఎలక్ట్రానిక్ పరికరాలను అన్‌ప్లగ్ చేసి ఉంచండి

ఎండల వేడి నేపధ్యంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, రాయలసీమ వంటి ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్ ప్రమాదం కలగనుందని రెడ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జరీ చేసింది, హిమాలయ పర్వత ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ, కర్ణాటక వంటి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..