AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mustard Oil: ఈ నూనెతో వంటలు చేస్తే మీరు ఊహించని లాభాలు..

ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల ఊహించని లాభాలు నెలకొన్నాయి. ఆవాల నూనెతో ఉండే బెనిఫిట్స్ అన్నీ ఇన్నీ కావు. పలు రకాల దీర్ఘకాలిక సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. తరచూ తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Mustard Oil: ఈ నూనెతో వంటలు చేస్తే మీరు ఊహించని లాభాలు..
Mustard Oil
Chinni Enni
|

Updated on: Nov 01, 2024 | 4:23 PM

Share

నూనెల్లో చాలా రకాల ఉన్నాయి. కానీ ఎక్కువగా వంటకు ఉపయోగించే వాటిల్లో పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ, కొబ్బరి నూనె ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పామ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ యూజ్ చేస్తారు. ఇప్పుడంటే ఆయిల్స్‌లో ఇన్ని రకాలు వచ్చాయి. కానీ పూర్వం ఎక్కువగా ఆవాల నూనె, నువ్వుల నూనెను ఉపయోగించేవారు. వీటితో వంటలకు రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం చలి కాలం కాబట్టి.. ఈ నూనె తీసుకోవడం వల్ల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకోవచ్చు. ఇంకా మరెన్నో దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తాయి. ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

కీళ్ల నొప్పులు మాయం:

తరచూ ఆవాల నూనె ఉపయోగించిన వంటలు తింటే కీల్ల నొప్పులు తగ్గించుకోవచ్చు. ఇందులో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటయి. ఇవి కీళ్లను దృఢంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అర్థరైటిస్‌తో బాధ పడేవారు ఈ నూనె తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గుండెకు మేలు:

మస్టర్డ్ ఆయిల్ వంటలు తినడం వల్ల గుండెకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు.. శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరిగేలా చేస్తాయి. దీంతో రక్త పోటు కూడా కంట్రోల్ అవుతుంది. ఈ క్రమంలో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

జలుబు, దగ్గు కంట్రోల్:

మస్టర్ ఆయిల్ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు అనేవి కంట్రోల్ అవుతాయి. ఛాతీలో పేరుకు పోయిన కఫాన్ని బయటకు పంపుతుంది. అదనపు నీరు ఉన్నా తగ్గుతుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవారికి ఆవాల నూనెతో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

చర్మం – జుట్టు సమస్యలు మాయం:

ఆవాల నూనెతో చేసిన వంటలు తినడం వల్ల చర్మానికి, జుట్టుకు కూడా చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు చర్మ రంగును మెరుగు పరుస్తాయి. ఎలాంటి మచ్చలు లేకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఆవాల నూనె తీసుకోవడం వల్ల తలపై వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. దీంతో రక్త ప్రసరణ బాగా జరిగి.. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!