Lungs: వీటిని తిన్నారంటే.. ఊపిరి తిత్తులు కడిగినట్లు క్లీన్ అవుతాయి..

శరీరంలో ఉండే ముఖ్యమైన భాగాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే ఆక్సిజన్ సరఫరా సజావుగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఊపిరి తిత్తుల వ్యాధులు బాగా ఎక్కువై పోయాయి. లంగ్స్ క్యాన్సర్ సమస్యలు కూడా వస్తున్నాయి. కాలుష్యం, పొగ తాగడం, ఇన్ ఫెక్షన్ల కారణంగా లంగ్స్ పాడై తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి..

Lungs: వీటిని తిన్నారంటే.. ఊపిరి తిత్తులు కడిగినట్లు క్లీన్ అవుతాయి..
Lungs
Follow us

|

Updated on: Sep 06, 2024 | 1:12 PM

శరీరంలో ఉండే ముఖ్యమైన భాగాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే ఆక్సిజన్ సరఫరా సజావుగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఊపిరి తిత్తుల వ్యాధులు బాగా ఎక్కువై పోయాయి. లంగ్స్ క్యాన్సర్ సమస్యలు కూడా వస్తున్నాయి. కాలుష్యం, పొగ తాగడం, ఇన్ ఫెక్షన్ల కారణంగా లంగ్స్ పాడై తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఆహారంతోనే ఎన్నో జబ్బులు నయం చేసుకోవచ్చు. తరచూ కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఊపిరి తిత్తులు కూడా క్లీన్ అవుతాయి. ఆరోగ్యంగా పనిచేస్తాయి. మరి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

యాంటీ ఆక్సిడెంట్లు:

ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని నిర్మూలించి.. క్లీన్‌గా ఉంచేలా చేస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి వాటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి.

చిలకడ దుంపలు:

చిలకడ దుంపలు అనేవి సీజనల్ వెజిటేబుల్. ఇవి కేవలం సీజనల్‌గానే లభిస్తాయి. కాబట్టి చిలకడ దుంపలు తినడం వల్ల ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. వీటిల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలోకి చేరగానే విటమిన్ ఏగా మారుతుంది. ఇది ఊపిరి తిత్తుల్లో ఉండే మలినాలు, వ్యర్థాలను బయటకు పంపించి.. శుభ్ర పరుస్తాయి.

ఇవి కూడా చదవండి

విటమిన్ సి పండ్లు:

లంగ్స్ క్లీన్ అవ్వాలంటే ఎక్కువగా విటమిన్ సి ఉండే పండ్లు తీసుకోవాలి. వీటిల్లో విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఈ రెండూ ఊపిరి తిత్తుల్లో పేరుకున్న వ్యర్థాలను తొలగించడంలో ఎంతో చక్కగా సహాయ పడతాయి. ఇవి ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తాయి. నారింజ, స్ట్రాబెర్రీ జాతికి చెందిన పండ్లు, ఆరెంజ్స్, నిమ్మకాయలు, క్యాప్సికం వంటి వాటిని తీసుకుంటే మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..