Raw Onions : తొక్కతీసిన , కోసిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా.. అయితే జాగ్రత్త అంటున్న ఆరోగ్యనిపుణులు
Raw Onions : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనేది సామెత.. ఉల్లి లేకుండా కూర చేయడం బహు అరుదు.. రోజూ కూరల్లోకి ఉల్లియపాలుండాల్సిందే.. కోసే సమయంలో కంటి నుంచి నీరు వస్తున్నా..

Raw Onions : ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనేది సామెత.. ఉల్లి లేకుండా కూర చేయడం బహు అరుదు.. రోజూ కూరల్లోకి ఉల్లియపాలుండాల్సిందే.. కోసే సమయంలో కంటి నుంచి నీరు వస్తున్నా సరే.. ఆ కంటి నీటిని తుడుచుకుంటూ.. ఉల్లిపాయలను కట్ చేసి కూర తయారు చేస్తాం.. అంతగా జీవితంలో ఒకభాగమైపోయింది ఉల్లిపాయ.. అయితే ప్రస్తుతం ఉన్న బిజీలైఫ్ వలనలో లేక కోసిన ప్రతి సారి కన్నీరు వస్తుందని.. ఒకేసారి కొన్ని ఎక్కువ ఉల్లిపాయలను ముక్కలుగా కోసి.. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు ప్రస్తుత జనరేషన్. అలా ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఉల్లి పాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. వీటిల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సల్ఫర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయితే ఉల్లిపాయను తొక్కతీసి గానీ.. కట్ చేసి కానీ ఫ్రిడ్జ్ లో పెడితే.. ఫ్రిడ్జ్ లో ఉండే బ్యాక్టీయాతో కలిసి ఉల్లిపాయల ఆక్సీకరణ చెంది,వ్యాధికారకంగా తయారు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కోసిన ఉల్లి పాయ ముక్కల నుంచి రసాలు విడుదలవుతాయి. ఇవి బ్యాక్టీరియాను ఆకర్షించి వాటి పెరుగుదలకు కారణమయ్యే పోషకాలుగా మారిపోతాయి.
ఒలిచిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెడితే.. చల్లటి ఉష్ణోగ్రత వల్ల ఉల్లిపాయలు క్రిస్పీ దనం కోల్పోతాయి. అంతేకాదు వ్యాధికారక కారకాలవుతాయి. అంతేకాదు ఉల్లిపాయల్లోని పోషక స్థాయిలు తగ్గిపోతాయి. బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది.
అయితే ఒలిచిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేసుకోవాలనుకుంటే.. వాటిని పొడిగ ఉన్న పేపర్ టవల్‌లో చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చు. అప్పుడు ఉల్లిపాయ ఫ్రిడ్జ్ గాలిలోని తేమకు ప్రభావం కాకుండా సురక్షితంగా ఉంటుంది.
Also Read: ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. మొటిమలు, మచ్చలు లేని అందమైన ముఖ వర్చస్సు మీ సొంతం.