గర్భధారణ సమయంలో ఛాతి నొప్పి వస్తోందా.? అయితే నిర్లక్ష్యం చేయకండి.! ఇది తెలుసుకోండి..

గర్భధారణ సమయంలో, మహిళలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ఒకటి ఛాతీ నొప్పి. సాధారణంగా...

గర్భధారణ సమయంలో ఛాతి నొప్పి వస్తోందా.? అయితే నిర్లక్ష్యం చేయకండి.! ఇది తెలుసుకోండి..
Chest Pain Pregency
Ravi Kiran

|

Jul 28, 2021 | 7:58 PM

గర్భధారణ సమయంలో, మహిళలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందులో ఒకటి ఛాతి నొప్పి. సాధారణంగా కడుపు, ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. పెరుగుతున్న శిశువుతో పాటు గర్భాశయం పరిణామం కూడా పెరగడం ద్వారా కడుపు, ఊపిరితిత్తులపై ఒత్తిడి మొదలవుతుంది. ఈ కారణంగా చాలామంది మహిళలు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అలాగే ఛాతి నొప్పి కూడా వస్తుంది. అయితే ఈ ఛాతి నొప్పి గ్యాస్, యాసిడిటీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కారణం ఏదైనా కూడా ఛాతి నొప్పి వచ్చినప్పుడు.. దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మీకు, మీ బిడ్డకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.

ఏం చేయాలి..

– గర్భధారణ సమయంలో తరచూ బీపీని చెక్ చేసుకోవాలి. ఛాతి నొప్పి వచ్చినప్పుడు మీరు వెంటనే బీపీని చెక్ చేసుకోండి. ఒకవేళ బీపీ పెరిగినా, తగ్గినా వెంటనే డాక్టర్లను సంప్రదించండి.

– గ్యాస్ వల్ల ఛాతి నొప్పి వస్తే.. ఇంటి చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు. నిమ్మకాయ, నల్ల ఉప్పును నీటిలో కలుపుకుని తాగితే కాస్త రిలీఫ్ పొందుతారు.

– గర్భాశయం పరిమాణం పెరగడం వల్ల ఛాతిలో నొప్పి వస్తే.. ప్రసవించే వరకు అది తగ్గదు. మీరు ఎక్కువగా కుడివైపున పడుకుంటే.. దానిని నుంచి ఉపశమనం పొందొచ్చు. ఒకవేళ ఇంకా నొప్పి తగ్గకపోతే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.

– క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. కొంత సమయం వాకింగ్ చేయడం, బ్యాలెన్స్‌డ్‌ డైట్ మైంటైన్ చేయడం మర్చిపోవద్దు.

Also Read:

దేశంలోని ఈ ఐదు ప్రదేశాల్లో లెక్కలేనన్ని నిధులు.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు..

ఈ వైరల్ ఫోటోలో పాము ఉంది.? అదెక్కడో గుర్తించండి చూద్దాం..!

రెండేళ్లుగా ఒక్క టెస్టూ ఆడలేదు.. ఇంగ్లాండ్‌లో సెంచరీ బాదేశాడు.. ఆ టీమిండియా ప్లేయర్ ఎవరంటే!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu