Banana Benefits: అరటి పండు తింటే తలనొప్పి మాయం.. గర్బిణీ స్త్రీలు వీటిని తినొచ్చా ?

అరటి పండ్లు.. హెల్తీ ఫ్రూట్స్‏లలో ఇవి ఒకటి. అంతేకాదు.. మార్కెట్లో అతి తక్కువ ధరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి.

Banana Benefits: అరటి పండు తింటే తలనొప్పి మాయం.. గర్బిణీ స్త్రీలు వీటిని తినొచ్చా ?
Banana
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2021 | 7:14 PM

అరటి పండ్లు.. హెల్తీ ఫ్రూట్స్‏లలో ఇవి ఒకటి. అంతేకాదు.. మార్కెట్లో అతి తక్కువ ధరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. చిన్న పిల్లలు.. పిల్లలు పెద్దవారు అందరూ ఇష్టంగా తినే అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే మహిళలు రోజూ అరటి పండ్లు తినవచ్చా ? ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు.. బరువు పెరుగుతామా ? అనే సందేహాలు చాలా మందిలో తలెత్తుతాయి. అయితే మహిళలు ఆహార పదార్థాలు తీసుకోవడంలో చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. రోజూ పని ఒత్తిడి.. అలసటను నీరసంను తగ్గించుకునేందుకు మహిళలు అరటి తినాలి. మహిళలు రోజూ ఒక అరటి పండు తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. మహిళలు అరటి పండు తీసుకోవడం వలన కలిగి ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.

అరటి తక్షణ శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో అధిక గ్లూకోజ్ స్థాయి ఉంటుంది. మహిళలు రోజూ ఉదయాన్నే అరటిపండు తింటే, వారికి రోజంతా శక్తి లభిస్తుంది. ఇందులో పోషకాలు అనేకం. అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒత్తిడి స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను (కార్టిసాల్ వంటివి) నియంత్రిస్తుంది. తద్వారా ఒకవేళ మీరు ఒత్తిడికి గురైతే, ఇది ఈ హార్మోన్లను నియంత్రిస్తుంది.

అయితే గర్భిణీ స్త్రీలు అరటి పండు తినొచ్చా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాలి. గర్భిణీ స్త్రీలు రోజుకు ఒక అరటి పండు తినవచ్చు. ఇది ఫోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఇది కొత్త కణాలను తయారు చేయడానికి, పుట్టబోయే బిడ్డలో పుట్టిన లోపాలను తొలగించడానికి అవసరమైనదిగా భావిస్తారు. పిండం యొక్క మంచి పెరుగుదలకు అరటి కూడా ఒక ముఖ్యమైన పండు. రక్తహీనత సమస్య మహిళల్లో చాలా ఎక్కువ. అరటి ఇనుముతో కూడిన ఆహారం. క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తొలగించవచ్చు. ఇది ఎర్ర రక్త కణాల తయారీకి సహాయపడుతుంది. తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలను అరటి పండు తగ్గిస్తుంది. మెగ్నీషియం అరటిలో సమృద్ధిగా లభిస్తుంది. ఇది తలనొప్పిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా అరటిపండు తింటే ఫలితం కనిపిస్తుందట.

గమనిక: పైన తెలిపిన కథనం పూర్తిగా ఇతర వెబ్ సైట్స్.. నిపుణుల నివేదికల ఆధారంగానే ఇచ్చినది.. వీటిని అమలు చేయడానికి ముందు డాక్టర్లను సంప్రదించాలి.

Also Read: Rashmika Mandanna: తగ్గేదే లే అంటున్న రష్మిక.. చేతిలో అర డజన్‏కు పైగా సినిమాలు.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ కీలక ప్రకటన.. ఆ కోర్సులకు దరఖాస్తులు ఎప్పటినుంచంటే..